ప్రపంచవ్యాప్తంగా వరుస భూకంపాలు ఇప్పుడు టెన్షన్ పెంచుతున్నాయి. మయన్మార్, టాంగో భూకంపాలు మరువక ముందే జపాన్‌లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6గా నమోదైంది. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరగలేదు. కానీ ఓ విషయంపై మాత్రం క్లారిటీ వచ్చింది. జపాన్‌లో భూకంపాలు రాబోతున్నాయని ఇప్పటికే అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది.. అంతలోనే ఈ భూకంపం రావడం ఇప్పుడు ఆందోళనలకు కారణమవుతుంది.
రీసెంట్‌గా అక్కడి ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం జపాన్‌లో భారీ భూకంపం రాబోతుంది. ఈ భూకంపం కారణంగా భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతంది. మొత్తం 2,98,000 మంది మృతి చెందుతారని.. 2 ట్రిలియన్ డాలర్ల మేరకు ఆస్తినష్టం జరుగుతుందని అంచనా వేశారు. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 8 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
ప్రపంచంలోని అత్యంత భూకంప ప్రభావిత దేశాల్లో జపాన్ ఒకటి. ఎందుకంటే నాన్‌కై ట్రఫ్ ఈ ఏరియాలోనే ఉంటుంది. ఇక్కడ ఫిలిప్పీన్ సీ ప్లేట్, యురేషియన్ ప్లేట్ కలుస్తాయి. ఇప్పటికే యురేషియన్ ప్లేట్ కిందకు జారడం వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నాన్‌కై ట్రఫ్‌లో భారీ భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. ప్రతీ వంద నుంచి 150 ఏళ్లకు ఒకసారి వస్తాయి. ఈ ఏరియాలో భూకంపం వస్తే షిజువోకా, కోచి, వాకాయామా వంటి ప్రాంతాల్లో భారీగా అలలు ఎగిసిపడతాయి. ఈ అలలు కొన్ని నిమిషాల్లోనే విధ్వంసం సృష్టించగలవు. అందుకే జపాన్ ఇప్పటి నుంచే ప్రజలను అప్రమత్తం చేస్తుంది. ఎన్ని చర్యలు తీసుకున్నా.. రాబోయే కాలంలో ఈ మెగా భూకంపం భారీన పడే అవకాశం తప్పదన్నది అక్కడి ప్రభుత్వ అంచనా.