22 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

మీరు వడ్డిస్తే.. మేమూ వడ్డిస్తాం.. చెల్లుకు చెల్లు

  • ప్రపంచ దేశాలపై ట్రంప్ టారిఫ్ దాడి
  • భారత్‌ కు 26% పరస్పర డిస్కౌంటెడ్‌ టారిఫ్‌
  • అన్ని దేశాలకు 10 శాతం బేస్ లైన్ టారిఫ్
  • ఇది ఇప్పటికే అమలులో ఉన్నదానికి అదనం
  • ఇది డర్టీ 15 దేశాలకు మరింత భారం
  • అమెరికాకు స్వేచ్ఛాదినం అన్న ట్రంప్‌
  • నిన్నటి రోజును లిబరేషన్ డేగా ప్రకటన
  • భారత్‌ కు పరస్పర దిగుమతి సుంకాల మినహాయింపు26%
  • అనేక కీల రంగాలపై దీని ప్రభావం
  • భారత ఆర్థిక పురోగతికి దెబ్బేనంటున్న నిపుణులు

ప్రపంచ దేశాలపై టారిఫ్‌ అస్త్రం ప్రయోగించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ చాలా హ్యాపీగా ఉన్నారు. తమ దేశం పునః వైభవాన్ని సాధించాక ఇష్టం లేని దేశాలతో సంబంధ బాంధవ్యాలు తెగ దెంపులు చేసుకోవడమే లక్ష్యమని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే టారిఫ్‌ ల మోత మోగిస్తున్నారని వారి అభిప్రాయం.ముందు ముందు రిలేషన్స్ సంగతి మాటెలా ఉన్నా.. ఇప్పుడు మాత్రం చాలా దేశాలు చుక్కలు చూస్తున్నాయి. అందులో మన భారత్ కూడా ఒకటి.పైగా భారత్ టారిఫ్‌లు ఏం తక్కువ ఉన్నాయా అంటూ కటువుగా రియాక్ట్ అవడం చూస్తుంటే ఈ టారిఫ్‌ల కక్ష ఇప్పట్లో తీరేలా లేదు.

లిబరేషన్ డే…

ప్రపంచ దేశాలకు టారిఫ్‌ లు విధించడం ద్వారా అమెరికాకి స్వేచ్ఛ లభించినట్లు ట్రంప్ ఫీలవుతున్నారు. అమెరికాకు పునః వైభవాన్ని, సంపదను సాధించడానికి ప్రపంచ దేశాలపై టారిఫ్‌ లు తప్పవంటున్నారు ట్రంప్.అమెరికాకు స్వేచ్ఛ దొరికిన రోజే విదేశీ వస్తువులపై ఆధారపడం తగ్గుతుదని భావన. నిన్నఅంటే ఏప్రిల్‌ 2 న అమెరికా లిబరేషన్ డే  అని ప్రకటించారాయన.కానీ టారిఫ్‌ విధింపు వల్ల సామాన్య అమెరికన్లు, అల్పాదాయ వర్గాలు బాగా ఇబ్బందులు పడతాయి. ఎందుకంటే ఈ టారిఫ్‌ ల వల్ల అమెరికాలో గృహావసరాల వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి.అయితే ధరలు పెంచడం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయమంతా కొత్త ప్రాజెక్టుల ఆరంభానికి, తద్వారా అమెరికా పునః వైభవానికి ఉపయోగపడతాయని ట్రంప్ సర్ది చెబుతున్నారు. అదెలా అంటే అమెరికా కూడా కొన్ని వస్తువులు, ఉత్పత్తులు,ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకుంటోంది.ఎగుమతి చేసే వస్తువులకన్నా, దిగుమతులు చేసుకోవాల్సిన అవసరం ఎక్కువ ఉండటంతో వాణిజ్య లోటు ఏర్పడుతోంది. దాదాపు 15 దేశాల కారణంగా అమెరికాకు ఆ వాణిజ్య లోటు ఏర్పడుతోంది. ఆయా దేశాలు తమ ఉత్పత్తులను అమెరికాకు అందించడానికి భారీగా టారిఫ్ లు విధిస్తున్నాయని,సరైన పారదర్శక విధానాన్ని అనుసరించడం లేదని, మోసగిస్తున్నాయని అమెరికా భావిస్తోంది. దాదాపు 21 దేశాలపై ట్రంప్ గుర్రుగా ఉండగా అందులో అమెరికాతో వ్యాపారం చేసే 15 అగ్రదేశాలపై కారాలు, మిరియాలు నూరుతున్నారు. వాటినే డర్టీ 15 గా ట్రంప్ పిలుస్తున్నారు.చైనా, యూరోపియన్ యూనియన్, మెక్సికో, వియత్నాం, ఐర్లాండ్, జర్మనీ, తైవాన్, జపాన్, సౌత్ కొరియా, కెనడా, ఇండియా, థాయ్‌లాండ్, ఇటలీ, స్విట్జర్లాండ్, ఇండోనేషియా, మలేషియా దేశాలన్నీ ట్రంప్‌ టారిఫ్ ల తాకిడి ఎదుర్కొంటున్నాయి.ఈ 15 దేశాలు అమెరికాతో జరుపుతున్న ఎగుమతి, దిగుమతుల్లో చాలా అంతరాలు ఉన్నాయన్నది ట్రంప్ భావన.

ట్రేడ్‌ వార్‌ షురు…

అన్ని దేశాలపై పరస్పర టారిఫ్‌లు విధిస్తున్నట్లు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.కొన్ని దేశాల వైఖరితో అమెరికా తీవ్ర నష్టాలబారిన పడుతున్నట్లు దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ పరస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యానించారు.అందుకే ఆయా దేశాలపై దయతలచి పరస్పర టారిఫ్‌ విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ట్రేడ్‌ వార్ మొదలైనట్లే.అమెరికాకు స్వేచ్చా దినం అంటూ ప్రకటించిన ట్రంప్‌ తమకు సమ ఉజ్జీలుగా ఎదుగుతున్న దేశాలన్నింటిపైనా టారిఫ్‌ల కొరడా ఝళిపించారు.తమకు దిగుమతి అయ్యే అన్ని వస్తువులపైనా పదిశాతం బేస్ లైన్‌ టారిఫ్‌ విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఇప్పటికే అమలులో ఉన్న టారిఫ్‌ కు అదనం. దీనివల్ల చైనా, రష్యా,కెనడా, ఈయూ దేశాలు తీవ్రంగా దెబ్బ తింటాయి.చైనాపై అందరికన్నా ఎక్కువగా 20 శాతానికి పైగా ఇప్పటికే అమల్లో ఉంది. ఇప్పుడు విధించిన తాజా ఉత్తర్వుతో అది 34 శాతానికి చేరుకున్నట్లే. ఇక ఈయూ పై 20 శాతం, ఇండోనేషియాపై 32 శాతం విధించారు. ఇవేకాక ప్రపంచంలో అనేక రంగాల్లో అగ్రగామిగా, అమెరికాకు దీటుగా ఎదుగుతున్న దేశాలన్నింటికీ ఈ టారిఫ్‌ ల చురక అంటుకున్నట్లే.

భారత్‌ కు స్పెషల్‌ డిస్కౌంట్‌…

అన్ని దేశాలపై టారిఫ్ మోత మోగించిన ట్రంప్ భారత్ తమకు మిత్రదేశమంటూనే 26 శాతం డిస్కౌంటెడ్‌ పరస్పర దిగుమతి సుంకాల విధానాన్ని ప్రకటించారు.. అంటే అమెరికాకు మన ఎగుమతులపై సగటున 26 శాతం పన్ను కట్టాల్సిందే.అమెరికా వస్తువులపై భారత్ విధిస్తున్న అత్యధిక టారిఫ్ లను ఈ సందర్భంగా ఏకరువు పెట్టారు.  పైగా భారత్ తగ్గిస్తే..అమెరికా కూడా తగ్గిస్తూ పోతుందని సరికొత్త బిజినెస్ డీల్‌ ముందుకు తెచ్చారు. ట్రంప్ ప్రకటించిన ఈ విధానం మన దేశంపై గట్టి ప్రభావమే చూపించనుంది. ఇతర దేశాలతో పోలిస్తే మనమీద కాస్త జాలి చూపించినట్టుగా పైకి కనిపిస్తున్నా.. ఈ పరస్పర దిగుమతి సుంకాల విధానంతో అనేక కీలక రంగాలు  ప్రభావితమయ్యే అవకాశాలున్నాయి. ఇది ఓవరాల్‌ గా భారత్‌ అభివృద్ధికి నష్టం కలిగిస్తుందంటున్నారు నిపుణులు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com