21.7 C
Hyderabad
Thursday, November 26, 2026

Live Video

spot_img

హైదరాబాద్‌లో విదేశీ యువతిపై దారుణం – లిఫ్ట్ పేరుతో గ్యాంగ్ రేప్

హైదరాబాద్ నగరంలోని పహాడీ షరీఫ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతంలో విదేశీ యువతిపై గ్యాంగ్ రేప్ ఘటన వెలుగులోకి వచ్చింది. జర్మనీకి చెందిన యువతిపై ఈ అఘాయిత్యం జరిగింది.

జర్మనీకి చెందిన యువతి సెలవుల్లో హైదరాబాద్‌ సందర్శనార్థం వచ్చింది. మీర్‌పేట్‌లోని ఫ్రెండ్‌ ఇంట్లో తాత్కాలికంగా బస చేస్తోంది. ఈ క్రమంలోనే.. సోమవారం రాత్రి మీర్‌పేట మందమల్లమ్మ సెంటర్ వద్ద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నయువతిని ముగ్గురు యువకులు చూశారు. ఆమెను నమ్మించి లిఫ్ట్ ఇస్తామంటూ కారులోకి ఎక్కించుకున్నారు. యువతి కూడా వాళ్లను నమ్మి కారు ఎక్కింది.

కారులో ఎక్కించుకున్న ముగ్గురు యువకులు ఆ జర్మనీ యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. కారులోనే తిప్పుతూ ముగ్గురు యువకులు రన్నింగ్‌లోనే ఆ యువతిపై ఒకరి తర్వాత ఒకరు వంతుల వారీగా అత్యాచారానికి పాల్పడ్డారు.

లైంగిక దాడి చేసిన తర్వాత ఆ ముగ్గురూ తిరిగి యువతిని వెనక్కి తీసుకొచ్చి తాము ఎక్కించుకున్న చోటే వదిలేసి.. నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. కొంత సేపటి తర్వాత తేరుకున్న యువతి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనపై జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది.

బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఘటనా స్థలం పరిసరాల్లోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు. క్యాబ్‌ డ్రైవర్‌తో పాటు.. ఈ కిరాతకానికి పాల్పడిన వాళ్లను గుర్తించే పనిలో పోలీసులు లీనమయ్యారు.

ఈ సంఘటన హైదరాబాద్‌ నగరంలో మహిళా భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగిన హైదరాబాద్‌లో మహిళల రక్షణపై ఆందోళన రేకెత్తించేలా చేసింది. మరి.. పర్యాటకురాలిగా వచ్చిన విదేశీ యువతిపై ఈ తరహా దాడి కేసును పోలీసులు ఎప్పుడు ఛేదిస్తారో చూడాలి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com