21.7 C
Hyderabad
Thursday, November 26, 2026

Live Video

spot_img

వందే కాశ్మీర్… వ్యాలీకి తొలి వందే భారత్‌ రైలు

  • ఏప్రిల్‌ 19న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం
  • ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా మధ్య రైలు లింక్ ప్రాజెక్ట్
  • అప్ గ్రేడ్‌ అవుతున్న జమ్మూ రైల్వేస్టేషన్
  • ప్రస్తుతం కశ్మీర్ లోయలో మాత్రమే రైలు సర్వీసులు
  • కశ్మీర్ కు, ఇతర ప్రాంతాలకు లింక్ స్టేషన్ గా కాట్రా
  • ఇప్పుడు కాట్రా మీదుగా మరిన్ని సర్వీసులు
  • 119 కీమీ. దూరంలో12.75 కి.మీ మేర టన్నెల్‌ రూట్‌
  • దేశంలో అత్యంత పొడవైన రవాణా లింక్ టన్నెల్
  • ప్రపంచంలోకే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ గా చినాబ్‌
  • నదీముఖానికి 329 మీటర్ల ఎత్తులో చినాబ్ బ్రిడ్జి
  • ఈఫిల్‌ టవర్ కన్నా 35 మీటర్ల ఎత్తు

భూతల స్వర్గం కశ్మీర్ కు తొలి వందే భారత్ రైలు సర్వీసు ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు వందే భారత్ రైలు సర్వీసులను ప్రారంభిస్తున్న కేంద్రం ఏప్రిల్‌ 19న కాట్రా నుంచి కశ్మీర్ కు ఈ రైలు సర్వీసును ప్రారంభిస్తోంది.272 కిలోమీటర్ల పొడవైన ఉదంపూర్-శ్రీనగర్- బారాముల్లా రైల్‌ లింక్ ప్రాజెక్టును కలపడం ద్వారా ఈ వందే భారత్ రైలు సర్వీసు మొదలవనుంది.ప్రస్తుత ప్రపంచ ప్రమాణాలకు దీటుగా,జమ్ము రైల్వే స్టేషన్ ను స్పీడ్‌ రైలు సర్వీసుకు అనువుగా అప్ గ్రేడ్‌ చేయనున్నారు. దాంతో జమ్ము-కాట్రా- శ్రీనగర్ మధ్య వందే భారత్ సర్వీసులు మొదలవనున్నాయి.
ఈ రైలు లింక్‌ ప్రాజెక్టును గతనెలలోనే నిర్మాణం పూర్తి చేశారు.కాట్రా-బారాముల్లా మధ్య రైలును ప్రయోగాత్మకంగా కలపడం ద్వారా ఆ రూట్‌ వినియోగానికి సిద్ధంగా ఉందని ఇంజనీర్లు తేల్చారు. కాట్రా-కశ్మీర్ మధ్య ఈ రైలు సర్వీసును రైల్వే సేఫ్టీ కమిషనర్ కూడా ఆమోదించారు.

జమ్మూ, శ్రీనగర్ మధ్య తగ్గనున్న దూరం

వందేభారత్ రైలు సర్వీసు ప్రారంభంతో జమ్మూ,శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయం బాగా తగ్గిందని తద్వారా ఈ ప్రాంతానికి ఆధునికమైన, సౌకర్యవంతమైన రైలు సర్వీసు ప్రారంభించినట్లయిందని అధికారులు అంటున్నారు.

19న జాతికి అంకితం

ప్రధానిమోడీ ఏప్రీల్‌ 19న ఉధంపూర్ కు రానున్నారని ప్రపంచంలోకే ఎత్తైన రైల్వే బ్రిడ్జిని సందర్శించిన అనంతరం కాట్రా నుంచి వందేభారత్ రైలు సర్వీసును ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ అన్నారు. ఈ రైలు సర్వీసును వినియోగంలోకి తేవడంద్వారా కశ్మీర్ కు రైలు కనెక్టివిటీ తేవాలన్న చిరకాల డిమాండ్‌ నెరవేరినట్లవుతుంది. ప్రస్తుతం రైలు సర్వీసులు సంగల్డాన్-బారాముల్లా రూట్‌ మధ్య లోయలోనూ, కాట్రా నుంచి దేశంలోని ఇతర ప్రాంతాల వరకూ మాత్రమే ఉండేవి.కశ్మీర్ ను దేశంలోని ఇతర ప్రాంతాలకు కనెక్ట్ చేసే కీ సెంటర్ గా కాట్రా ఉంది. ఇప్పడు వందే భారత్ రాకతో కశ్మీర్ కు ఇతర ప్రాంతాలనుంచి రైలు కనెక్టివిటీ పెంచడంలో మరో అడుగు ముందుకు పడింది.

ఉదంపూర్- శ్రీనగర్ -బారాముల్లా రైలు లింక్‌ ప్రాజెక్ట్

కశ్మీర్‌ కు రైలు సర్వీసును ప్రారంభించాలన్న తలంపు వాస్తవానికి 1997లోనే మొదలైంది. కానీ ఆ సర్వీసు ప్రారంభించడానికి మాత్రం భౌగోళిక పరంగా,భూ భౌతిక వాతావరణం రీత్యా,టోపోగ్రఫికల్‌ పరంగా అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఈ ప్రాజెక్టు మొత్తం 119 కిలోమీటర్ల దూరం కాగా అందులో 12.75 కిలోమీటర్ల పొడవునా రైలు లింక్‌ ఏర్పాటుకు 38 టన్నెల్స్ నిర్మించాల్సి వచ్చింది.ఇందులో టీ-49 టన్నెల్‌ ను మన దేశంలోకే అత్యంత పొడవైన రవాణా టన్నెల్‌ గా గుర్తించారు.

ప్రపంచంలోకే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్

దీనికి తోడు మొత్తం 13 కిలోమీటర్ల మేర 927 బ్రిడ్జిలను కూడా నిర్మించారు. వీటిలో చినాబ్‌ బ్రిడ్జి ప్రముఖమైంది. 467 మీటర్ల పొడవైన ఆర్చితో 1,315 మీటర్ల మేర చినాబ్ బ్రిడ్జి గుర్తింపు పొందింది.నదీ ముఖానికి 389 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ బ్రిడ్జి ప్రపంచంలోకే ఎత్తైన ఈఫిల్‌ టవర్ కన్నా ఎత్తైనది. ఈఫిల్‌ టవర్ కన్నా 35 మీటర్లు ఎత్తులోఉన్న చినాబ్‌ బ్రిడ్జి ప్రపంచంలోకే అత్యంత ఎత్తైన ఆర్చి కలిగిన రైల్వే బ్రిడ్జిగా కూడా రికార్డు నమోదు చేసుకుంది.

వందేభారత్ రైలు స్పెషాలిటీస్ ఇవే

కశ్మీర్ లో ప్రారంభం కానున్న వందే భారత్ రైలుకు కొన్ని విశిష్టతలున్నాయి. ఈ రైలు మంచును సైతం కోసుకుంటూ పోతుంది. ఈ రైలు వినియోగంతో ఈ రూట్‌ లో ఇతర సర్వీసులు కూడా మంచులోనూ నడుపుకునే వీలుంటుంది. ఈ వ్యూహాత్మక రూట్‌ లో ఇకపై పగలు, రాత్రి కూడా నిరంతరాయంగా రైలు సర్వీసులు నడుపుకోవచ్చు. ఇది సరకు రవాణాకూ కీలకమే.

యాంటీ వైబ్రేషన్ సిస్మిక్ డివైసెస్

ఈ ప్రాంతానికి , దేశంలోని మిగతా భాగాలకు అన్ని సీజన్లలోనూ రైళ్లు తిరిగే వీలుంటుంది. ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రైలు సర్వీసులు అందించాలన్న ఉద్దేశంతో జోన్ V భూకంప జోన్ లో ఉన్నందున యాంటీవైబ్రేషన్ సిస్మిక్ డివైసెస్ ను అనుసంధానం చేశారు.ఈపరికరం హిమాలయ పర్వాతాల ప్రాంతంలో వచ్చే ఏ ప్రకంపనలను అయినా మింగేసి ప్రయాణికులకు సురక్షితమైన , వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది.

ఇతర రైళ్ల కన్నా భిన్నం

కశ్మీర్ లో నడిచే వందే భారత్ రైలు సర్వీసు దేశంలోని ఇతర వందేభారత్ లకన్నా భిన్నమైన సర్వీసు. ఇది బిలోనార్మల్‌ టెంపరేచర్ లోనూ హాయిగా పరిగెడుతుంది. అంటే మైనస్ 20 డిగ్రీల చలిలోనూ పట్టాలపై దూసుకుపోగలదు. పైగా చలికాలంలో ఈ రైలు లో ప్రయాణికులకు వెచ్చని హీటింగ్‌ సిస్టమ్‌ ను కూడా అందిస్తుంది. దాంతో చలి భయం ఉండదు.

డ్రైవర్ కేబిన్ భిన్నంగా

ఇందులో డ్రైవర్ క్యాబిన్ కూడా విభిన్నంగా ఉంటుంది. ఎలాంటి అనను కూల వాతావరణంలోనైనా డ్రైవర్ కు వ్యూ బాగా కనిపించే విధంగా రైలుకు హీటెడ్‌ విండ్‌ షీల్డ్ ను అమర్చారు. దీనివల్ల గడ్డకట్టుకు పోయే చలిలో సైతం క్యాబిన్ అద్దాలపై మంచు పేరుకోదు.అంతేకాదు రైలు అంతటా వేడి వాతావరణం, వేడినీరు, బయోటాయిలెట్లు అందుబాటులో ఉంటాయి. అత్యంత చలి వాతావరణంలోనూ రైలు ప్రయాణం, సర్వీసుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేలా వేడి రైలు అంతటా వెచ్చగా తగులుతూ ఉంటుంది.నిజంగా ఇలాంటి చలి వాతావరణంలో జర్నిచేయడం ఓ చిత్రమైన అనుభూతిని కలిగించడం ఖాయం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com