27.9 C
Hyderabad
Friday, June 5, 2026

Live Video

spot_img

హెచ్‌సీఏపై మరో వివాదం.. వెళ్లిపోతామన్న సన్‌ రైజర్స్‌.. అసలేం జరిగింది?

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. అయితే అధికార కుంపట్లు.. లేదా అవినీతి సిగపట్లు.. ఇందులో తప్ప క్రికెటర్ల విషయంలో ఎప్పుడూ వార్తల్లోకి రాదు. ఇప్పుడు కూడా ఇదే విషయంలో మరోసారి హెడ్‌లైన్స్‌కు ఎక్కింది. రీజన్.. తమకు ఫ్రీ పాస్‌లు ఇవ్వాలంటూ SRH మేనేజ్‌మెంట్‌ను వేధించడం. ఏకంగా HCA అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావుపై SRH సంచలన ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది. IPL టికెట్ల విషయంలో జగన్‌మోహన్‌రావు తమను పలుమార్లు బెదిరించారని ఆరోపించింది.

నిజానికి HCAకు 10 శాతం టికెట్లు ఇస్తోంది SRH మేనేజ్‌మెంట్. ఇవీ కాకుండా తమకు మరిన్ని టికెట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారట HCA పెద్దలు. దీంతో ఈ బాధలు తాళలేక చెతలేత్తేసింది SRH మేనేజ్‌మెంట్. దీంతో మ్యాచ్‌కు ముందు కార్పొరేట్‌ బాక్సుకు తాళం వేశారంటోంది SRH. IPL కోసం స్టేడియం లీజుకు తీసుకున్నా.. మ్యాచ్‌లపై HCA పెత్తనం చెలాయిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. HCA దెబ్బకు తాము హైదరాబాద్ విడిచి వెళ్తామనే మాటలు వినిపిస్తోంది SRH నుంచి. ఈ సమస్యకు పరిష్కారం చూపించాలంటూ HCA ట్రెజరర్‌కు ఓ మెయిల్‌ పంపినట్టు తెలుస్తోంది.

అయితే HCA వర్షన్ మాత్రం మరోలా ఉంది. అసలు ఇందులో ఎలాంటి నిజం లేదని చెబుతోంది HCA. తమ అధికారిక మెయిల్‌ ఐడీకి.. SRH మేనేజ్‌మెంట్ నుంచి అఫిషియల్ మెయిల్‌ ఐడీ ఏదీ రాలేదని చెబుతోంది. దీని వెనక ఏదో కుట్ర ఉందని కూడా ఆరోపిస్తోంది. అసలు పూర్తి వివరణ SRH నుంచి తీసుకోవాలని రివర్స్‌లో చెబుతోంది HCA.

ప్రస్తుతం HCA వివరణ చూస్తుంటే మరిన్ని అనుమానాలు పెరుగుతున్నాయి. వచ్చిన ఆరోపణలపై ఎలాంటి రియాక్షన్ లేదు. టికెట్లు, పాస్‌ల వ్యవహారంపై ఒక్క మాట కూడా లేదు అందులో. ముఖ్యంగా HCA అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావుపై వచ్చిన బెదిరింపు, బ్లాక్‌మెయిల్‌ ప్రచారంపై కూడా ఎలాంటి స్పందన లేదు. మొత్తంగా చూస్తే ఏదో మొక్కుబడిగా ఓ వివరణ ఇవ్వాలి కాబట్టి.. ఇచ్చినట్టు కనిపిస్తోంది.

మరి నిజంగానే ఈ పంచాయితీ పడలేక SRH వేదికను మార్చుకుంటుందా? ఫ్రాంచైజీ హైదరాబాద్‌ను వీడితే పరిస్థితి ఏంటి? జగన్‌మోహన్‌ రావుకు నిజంగానే ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్‌ ఆడడం ఇష్టం లేదా?

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com