హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని తెలంగాణ భవన్లో శ్రీ విశ్వావసు నామ ఉగాది పర్వదిన వేడుకలు నిర్వహించారు.ఈ సందర్బంగా పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. వేద పండితులు పంచాంగ శ్రవణం చేస్తూ.. ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపాలు వస్తాయన్నారు. సంపూర్ణంగా వర్షాలు పడతాయని, ప్రభుత్వం పాలన చేయడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. కేంద్రం నుండి వచ్చే సహకారం కూడా తీసుకునే అవకాశం ఉండదని చెప్పారు. పత్తి పంటలకు మంచి అవకాశం ఉందని, ఎర్ర నేలలో వేసే పంటకు మంచి అవకాశం ఉందని, అలాగే.. వస్త్ర పరిశ్రమలు కొత్తగా వెలుస్తాయని, అభివృద్ధి బాగుంటుందని చెప్పారు.
ఇక, ప్రభుత్వం ప్రకటించిన పథకాలు నామ మాత్రంగానే ముందుకు వెళ్తాయని, కొన్ని రోజుల తర్వాత పోలీస్ వ్యవస్థకు ఎక్కువ అధికారాలు వచ్చే అవకాశం కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా బీఆర్ఎస్దే విజయం అని, అయితే, ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడానికి ముందుకు రాదన్నారు. కోర్టులో ప్రభుత్వనికి మొట్టి కాయలు పడతాయని, కేసీఆర్‌కి ఈ సంవత్సరం మంచిగా ఉందని, కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని వేద పండితులు పంచాంగ శ్రవణంలో చెప్పారు.
తెలంగాణ భవన్లో జరిగిన ఉగాది వేడుకల్లో కేటీఆర్‌తో పాటు.. ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, పువ్వాడ అజయ్, బొల్లం మల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.