ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు రంగాల్లో సేవలందిస్తున్న వాళ్లకు కళారత్న పురస్కారాలు ప్రకటించింది. విశ్వావసు నామ ఉగాది పర్వదినం సందర్భంగా ఈ అవార్డులు ప్రకటించారు. ఆదివారం జరిగే ఉగాది పండుగ వేడుకల్లో వీరికి అవార్డులు ప్రదానం చేయనున్నారు.
అయితే, పలు రంగాలకు చెందిన వాళ్లకు అవార్డులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. వారిలో ఐదుగురు జర్నలిస్టులకు కూడా అవార్డులు ప్రకటించింది. సీనియర్ జర్నలిస్టులు గుండు వల్లీశ్వర్, భోగాది వెంకట రాయుడు, కొల్లు అంకబాబు, కె.నాగ సుధాకర్, వేమూరి బలరామ్లకు అవార్డులను ప్రకటించారు. వీరిని ఆదివారం జరిగే ఉగాది వేడుకల్లో ప్రభుత్వం తరపున సత్కరించనున్నారు. అయితే, అవార్డులు ప్రకటించిన విషయం ఆలస్యంగా సమాచారం ఇచ్చారని పలువురు చెప్పారు.