24.6 C
Hyderabad
Thursday, June 25, 2026

Live Video

spot_img

భూకంప మృతుల సంఖ్య.. 10 వేలు దాటుతోందా?

మయన్మార్, థాయ్‌లాండ్ భూకంపం సృష్టించిన విధ్వంసం లెక్కలు ఇప్పుడిప్పుడే భయటపడపడుతున్నాయి. ఈ రెండు దేశాల్లో మృతుల సంఖ్య వేలల్లో ఉంది. ఒక్క మయన్మార్‌లోనే మృతుల సంఖ్య వెయ్యి దాటింది. ఇది అధికారిక లెక్క మాత్రమే. అనధికారికంగా ఈ లెక్క ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇక శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని బయటికి తీసే పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే రెండు దేశాల్లో మృతుల సంఖ్య 10 వేలు దాటుతుందని అంచనా వేస్తున్నారు.

ఇక థాయ్‌లాండ్ విషయానికి వస్తే అధికారికంగా 10 మంది మృతి చెందగా.. ఒక చోట భవన నిర్మాణ కార్మికుల ఆచూకి లభించడం లేదు. మొత్తం 100 మంది కార్మికుల ఆచూకి లభించడం లేదని అధికారులు చెబుతున్నారు.

మయన్మార్‌లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించగా.. మరోసారి 4.2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. ఆపరేషన్ బ్రహ్మ పేరుతో భారత్ భూకంప బాధిత దేశాలకు సహాయం అందించింది. సహాయ కార్యక్రమాల్లో పాల్గోనేందుకు వందకు పైగా NDRF సిబ్బంది ఇప్పటికే మయన్మార్‌కు పయనమయ్యారు. 15 ట‌న్నుల స‌హాయ‌క సామాగ్రి కూడా పంపించింది.

భూకంపం ఎఫెక్ట్‌ ఎక్కువగా మయన్మార్‌లో కనిపిస్తోంది. ఇప్పటికే అంతర్యుద్ధంతో అట్టుడికిపోతున్న ఈ దేశంలో నీరు, విద్యుత్ సమస్య ఉంది. దీంతో ప్రపంచ దేశాలు తమకు సాయం చేసేందుకు ముందుకు రావాలంటూ పిలుపునిచ్చారు ఆ దేశ మిలటరీ పాలకులు. చైనా, రష్యా ఇప్పటికే వారి తరపున కావాల్సిన సహాయాన్ని మయన్మార్‌కు పంపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com