37.2 C
Hyderabad
Friday, April 24, 2026

Live Video

spot_img

KKR.. వార్ వన్ సైడ్.

కోల్‌కతా వర్సెస్ రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌ వార్‌ వన్‌ సైడే అన్నట్టుగా జరిగింది. 152 పరుగుల టార్గెట్‌ను 17.3 ఓవర్లలో ఛేజ్ చేసి ఐపీఎల్‌లో బోణి కొట్టింది. కోల్‌కతా ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్ 97 పరుగులతో ఒంటి చెత్తో కోల్‌కతాను గెలిపించాడు. దీంతో మ్యాచ్‌ను గెలిపించిన క్రెడిట్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ను కూడా ఎగరేసుకుపోయాడు.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన 151 పరుగులు మాత్రమే చేసింది. మొదట దూకుడుగా మ్యాచ్‌ను ప్రారంభించినా.. కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్‌కు పరుగులు రాలేదు. యశస్వి, 29, సంజు 13 పరుగులు మాత్రమే చేశాడు. రియాన్ పరాగ్ 25, ధ్రువ్ జురెల్ కూడా 33 పరుగులకే పరిమితమయ్యారు. దీంతో 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్‌కతా బౌలర్స్‌లో వైభవ్, హర్షిత్, మొయి్, వరుణ్ చక్రవర్తి తలో రెండు వికెట్లు తీశారు.

ఇక ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఆరో ఓవర్లో ఓ షాక్ తగిలింది. మొయిన్ అలీ కేవలం 5 పరుగులకే రనౌట్‌గా వెనుదిరిగాడు. అప్పుడు KKR స్కోర్ 41 పరుగులు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు క్రీజులో ఉన్న డీకాక్ వీర విజృంభణ అప్పటికే మొదలైందని. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రహానే కూడ 18 పరుగులకే వెనుదిరిగాడు. అయితే రాజస్థాన్‌ స్పిన్నర్లను బరిలోకి దించడంతో మ్యాచ్ కాస్త స్లో అయ్యింది. జోఫ్రా ఆర్చర్‌ వేసిన 17వ ఓవర్‌లో 4, 6, 6తో మ్యాచ్‌ను ముగించాడు డికాక్.

ఈ మ్యాచ్‌లో కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు ఆర్చర్. 2.3 ఓవర్లు వేసి ఏకంగా 33 పరుగులు ఇచ్చాడు ఆర్చర్. ఇతని బౌలింగ్‌లో 8 బాల్స్ ఆడిన డికాక్‌.. ఏకంగా 28 పరుగులు చేశాడు. హసరంగా మాత్రం ఒక వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు KKR హిస్టరీలో ఛేజింగ్‌లో అత్యధిక పరగులు చేసిన ప్లేయర్‌గా డికాక్‌ నిలిచాడు. ఈ విక్టరీతో KKR బోణి కొట్టగా.. RRకు మాత్రం రెండో ఓటమి వచ్చి చేరింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com