25.1 C
Hyderabad
Saturday, October 31, 2026

Live Video

spot_img

ఐపీఎల్‌లో తొలి రౌండ్ కంప్లీట్..ఎవరి పరిస్థితేంటి?

ఐపీఎల్‌లో తొలి రౌండ్ ముగిసింది. 18వ సీజన్‌లో గ్రూప్ దశలో అన్ని టీమ్స్ ఒక్కో మ్యాచ్ ఆడేశాయి. KKR-RCB మధ్య మొదలైన మ్యాచ్‌తో ప్రారంభమైన సీజన్… పంజాబ్, గుజరాత్ మధ్య మ్యాచ్‌తో తొలి రౌండ్ ముగిసింది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లో చూస్తే పాయింట్స్ టేబుల్‌లో తొలి స్థానంలో ఉంది SRH. ఆ తర్వాత RCB, PBKS, CSK, DC ఉన్నాయి. ఈ టీమ్స్ అన్నింటికి తలో రెండు పాయింట్లు ఉన్నా.. నెట్ రన్ రేట్ ప్రకారం చూసుకుంటే 2.2తో టాప్‌ ప్లేస్‌లో ఉంది SRH.

ఇక లక్నో, ముంబై, గుజరాత్, కోల్‌కతా, రాజస్థాన్ తమ అకౌంట్‌ను ఇంకా తెరవలేదు. అయితే అప్పుడే ఇంకా అయిపోలేదు. ఐపీఎల్‌లో ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలే ఉన్నాయి. కాబట్టి అప్పుడే ఎవరు గొప్ప? అనే ప్రశ్నకు తావులేదు.

సీజన్‌ ఆరంభంలోని తొలి మ్యాచ్‌లోనే ఐపీఎల్ హిస్టరీలో రెండో అత్యధిక స్కోర్‌ను చేసింది SRH. ఓన్ గ్రౌండ్‌లో పరుగుల వరద పారించి ఏకంగా 286 పరుగులు చేసింది SRH. ఇక RCB అయితే డిఫెండింగ్ ఛాంపియన్‌ను వారి సొంత మైదానంలోనే మట్టి కరిపించింది. ఏకంగా ఏడు వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలిచి పాయింట్స్ టేబుల్‌లో సెకండ్ ప్లేస్‌కు వచ్చేసింది.

ఇక ఎప్పటిలాగానే ఓటమితో తమ సీజన్‌ను ప్రారంభించింది ముంబై. చెపాక్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై పైచేయి సాధించిందనే చెప్పాలి. పిచ్ ఎఫెక్ట్ ఏమో కానీ.. ఇక్కడ భారీ స్కోర్‌లు నమోదు కాలేదు. అయితే ముంబై తరపున విఘ్నేష్‌ పుత్తూర్ అనే ప్లేయర్ టాలెంట్ మాత్రం ప్రపంచానికి పరిచయమైంది.

ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇకపై ఓ లెక్క అంటోంది పంజాబ్ కింగ్స్. టీమ్‌ను మొత్తం రీషఫిల్ చేసుకున్న పంజాబ్.. ఇప్పుడు కొత్తగా, ప్రమాదకరంగా కనిపిస్తోంది. టీమ్ పగ్గాలు తీసుకున్న శ్రేయస్ అయ్యర్ తొలి మ్యాచ్‌లోనే 97 పరుగులతో రాణించాడు. అంతేకాదు ప్రియాన్ష్‌ ఆర్యా, శశాంక్ సింగ్ కూడా తామేం తక్కువ కాదన్నట్టుగా ఆడుతున్నారు.

ఇక ఢిల్లీ విషయానికి వస్తే అశుతోష్‌ శర్మ పేరుతో మరో యంగ్ టాలెంట్ ప్రపంచానికి పరిచయమైంది. లక్నోతో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో అశుతోష్‌ బ్యాటింగ్ గురించి చెప్పుకోవాల్సిందే. చివరి బాల్ వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో తన సత్తా ఏంటో చాటాడు ఈ ప్లేయర్.

మొత్తానికి ఈసారి ఐపీఎల్ సీజన్‌లో అనేక సంచలనాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఇకపై కూడా నమోదవ్వడం మాత్రం గ్యారెంటీ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com