34.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

ఆన్‌ లైన్ గేమ్స్ ఆడేవారు ఇవి పాటించండి…!!

అసలు ఆన్ లైన్ గేమింగ్‌ అనేదే పెద్ద వ్యసనం. తాగుడు, జూదం,పేకాట లాంటిదే. కాకపోతే కాస్త మోడ్రన్ గా కంప్యూటర్,మొబైల్,లేదా ల్యాప్టాప్‌లతో ఆడుతుంటారు. కానీ ఇదో సరదా వ్యాపకంగా, లేదా వ్యసనంగా మారిన వారు ఆడాలని కోరికతో ఉంటే కనీసం సురక్షితమైన యాప్ లనైనా ఎంచుకోమని కేంద్రం సలహా ఇస్తోంది. కనీసం మన దేశానికి తగిన పన్నుకట్టి, ప్రతీ లావాదేవీకి జవాబు దారీగా, అంతా నిజాయితీగా నిర్వహించే యాప్స్ జోలికి మాత్రమే వెళ్లమని సలహా ఇస్తోంది.ఆన్ లైన్ గేమింగ్‌ ఆడాలనుకునేవారు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం శాఖ పరిధిలోని సైబర్ సెక్యూరిటీ వింగ్‌ సూచిస్తోంది. అందుకు సంబంధించి కొన్నిమార్గదర్శకాలు కూడా జారీ చేసింది.

గుర్తింపు పొందిన వెబ్‌ సైట్ లనుంచే డౌన్ లోడ్‌…

గుర్తింపు పొందిన వెబ్ సైట్లనుంచి లేదా సురక్షితమైన, గుర్తింపు పొందిన యాప్ స్టోర్స్ నుంచే యాప్ లను డౌన్ లోడ్‌ చేసుకోవాలి.

వ్యక్తిగత సమాచారం నమోదు లో జాగ్రత్త…

గేమ్‌ కు సంబంధించి ఏవైనా  వివరాలు ఇవ్వాల్సివస్తే వాటి ఎంట్రీ, నమోదులో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకు సంబంధించిన వేదికలపైనా, ఫోరమ్స్, చాట్స్ లోనూ వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదు. స్కామర్లు సోషల్‌ ఇంజనీరింగ్ టెక్నిక్ ద్వారా ప్లేయర్లను కూడా మార్చేయగలరు.

యాప్‌ పర్మిషన్ల తనిఖీ…

యాప్‌ ల డౌన్ లోడ్ విషయంలో అందుకు సంబంధించిన పర్మిషన్లు ఇవ్వడం, వివరాల నమోదు లో జాగ్రత్త వహించాలి.

ఆన్ లైన్ ఫ్రాడ్‌ జరిగితే ఫిర్యాదు…

కస్టమర్లు ఆన్ లైన్ గేమింగ్‌ లో ఫ్రాడ్‌ జరిగిందని గమనిస్తే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కు కాల్ చేయాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com