28.8 C
Hyderabad
Thursday, June 25, 2026

Live Video

spot_img

బెంగాలీ రసగుల్లా మోనామీ ఘోష్

మోనామి ఘోష్ బెంగాలి చిత్ర పరిశ్రమతోపాటు బుల్లి తెర నటిగా బిజీగా ఉంది. 17 ఏళ్ల వయసులోనే టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టిన మోనామి బెంగాలీ ధారావాహిక సాత్ కహోన్ లో నటించింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే మోనామీ ఘోష్ ను అభిమానులు బెంగాలి రసగుల్లా అని ముద్దుగా కామెంట్ చేస్తారు.పశ్చిమ బెంగాల్లోని ఉత్తరపరగాణా జిల్లా బసీర్ హట్ లో 1984 జులై 13న మోనామీ ఘోష్ జన్మించింది.

1999లో బుల్లితెరతో ప్రారంభించి 2004లో కాలో చిత(kalo chita) సినిమాతో వెండితెర మీదకు అడుగుపెట్టింది.హోలీ రోజు మోనామీ సందడి అంతా ఇంత కాదు. బెంగాలీ సంప్రదాయ దుస్తులు ధరించి మిత్రులతో హోలీ కేలీలో హల్ చల్ చేసింది. నాలుగు పదులు దాటినా ఈ ముద్దుగుమ్మ ఇంకా పెళ్లి చేసుకోలేదు. మనసైనోడు దొరికాక మనువాడుతాను అంటోంది.విభిన్నమైన పాత్రలను చేయటానికి ఇష్టపడే మోనామీ…ఏ మాత్రం అవకాశం దొరికినా ఫ్యాషన్ షోల్లో పాల్గొని కుర్రాళ్లను హుషారెత్తిస్తుంది.40 ఏళ్ల వయసులో కూడా ఈ భామ ఫిజికల్ ఫిట్ నెస్ విషయంలో లేటెస్ట్ హీరోయిన్లను చాలెంజ్ చేస్తుంది.దాదాగిరి అన్ లిమిటెడ్ ధారవాహిక తర్వాత డాన్స్ డాన్స్ జూనియర్ షోల్లో న్యాయనిర్ణేతగా ఉంటూనే సినిమాల్లో బిజీగా ఉంది. అసలే బెంగాలీ చిన్నది..అపై గ్లామరస్ నటి. వీలైనప్పుడల్లా హాట్ ఫోటోలతో అభిమానులకు అందాలు విరజిమ్ముతుంది.

courtesy : instagram

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com