26.2 C
Hyderabad
Saturday, June 27, 2026

Live Video

spot_img

డీలిమిటేషన్‌ పై ప్రధాని మోడీకి లేఖ రాసిన వైఎస్‌.జగన్‌

దేశవ్యాప్తంగా త్వరలో జరగనున్న నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి ప్రధాని మోడీకి లేఖ రాశారు. డీలిమిటేషన్‌ వ్యవహారంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన నెలకొన్న నేపథ్యంలో వైఎస్‌.జగన్‌ ఈ విషయంపై ప్రధానికి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత 15 ఏళ్ళలో ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గిందని దీనికి కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపే కారణమనే విషయం ప్రత్యకంగా చెప్పక్కర్లేదని ప్రధానికి రాసిన లేఖలో జగన్‌ పేర్కొన్నారు. జనభా ఆధారంగా డీలిమిటేషన్‌ ప్రక్రియ కనుక జరిగిఏ మా రాష్ట్రాల్లో పార్లమెంట్‌ నియోకవర్గాలు తగ్గుతాయనే చర్చ దక్షిణాది రాష్ట్రాల్లో జరుగుతోందని, అందుకే జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్‌ జరగకుండా చూడాలని జగన్‌ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. దేశానికి సంబంధించి పార్లమెంటులో తీసుకునే విధాన నిర్ణయాల విషయంలో అన్ని రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం ఉండాలని అప్పుడే జాతీయ విధాన రూపకల్పనలో అన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యత ఉంటుందని లేఖలో ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళారు జగన్‌. అందుకే దక్షిణాదిలో సీట్లు తగ్గకుండా డీలిమిటేషన్‌ ప్రక్రియ చేపట్టాలని జగన్‌ కోరారు. మీరు ఈ కోణంలో ఆలోచించి నియోజవకర్గాల పునర్విభజన చేపట్టాలని కోరుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. లోక్‌ సభ, రాజ్యసభలో సైతం ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండేలా త్వరలో చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు పూర్తి చేయాలని జగన్‌ ప్రధానికి అభ్యర్ధించారు. ఇదిలా ఉండగా డీలిమిటేషన్‌ లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో దాన్ని అడ్డుకునే క్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కేస్టాలిన్‌ శనివారం చెన్నైలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. దీంతో వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రధానికి రాసిన లేఖను వైఎస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీసుబ్బారెడ్డి డీఎంకే పార్టీకి కూడా అందజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com