34.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

నాణ్యమైన విద్యుత్ నిరంతరాయంగా సరఫరా – భట్టి

తెలంగాణ రాష్ట్రంలో నిరంతరాయ విద్యుత్‌ సరఫరా జరుగుతోందని చేస్తున్నదని ఉప ముఖ్యమంత్రి, మరియు ఆర్ధిక, ప్రణాళిక మరియు విద్యుత్ శాఖా మాత్యులు భట్టి విక్రమార్క మల్లు గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు.  రాష్ట్రం మొత్తం మీద విద్యుత్ సరఫరా17,162 మెగావాట్ల గరిష్ట డిమాండ్ కు చేరుకున్నప్పటికి కూడ ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండ ప్రజా ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ ను నిరంతరాయంగా సరఫరా చేస్తోందన్నారు. వాస్తవానికి తెలంగాణలో గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 17,162 మెగావాట్లకు చేరడం అనేది సరికొత్త రికార్డ్‌ అన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 2023 – 24 సంవత్సరంలో 2024 మార్చి 8వ తేదీన గరిష్టంగా 15,623 మెగావాట్ల డిమాండ్‌ నమోదై ఉందని ఆ తరువాత తాజాగా నమోదైన 17,162 మెగావాట్లే అధికమన్నారు. తెలంగాణ పవర్‌ యుటిలిటీ నిన్న 20వ తేదీన సాయంత్రం 4.39 గంటలకు ఈ గరిష్ట విద్యుత్‌ డిమాండ్ నమోదయ్యిందన్నారు. 2023 డిసెంబర్‌ నుంచి కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, చర్యల ఫలితంగా వేసవి కాలంలో పెరిగే విద్యుత్‌ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించామని భట్టి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్‌ ఉత్పత్తి పెంచడం, ప్రసార, పంపిణీ వ్యవస్ధను బలోపేతం చేయడం వంటి పకడ్బందీ చర్యలు చేపట్టామని తెలిపారు. పారిశ్రామిక, వాణిజ్య, ఐటీ కార్యాలయాల కార్యకలాపాలు పెరగడంతో గత సంవత్సరాలతో పోలిస్తే డిమాండ్  ఈ వేసవిలో భారీగా పెరిగిందన్నారు. అయినప్పటికీ, ప్రభుత్వం అన్ని వర్గాల వినియోగదారులకు, వ్యవసాయానికి కూడా నిరంతరంగా విద్యుత్ ను నాణ్యతతో సరఫరా చేస్తున్నామన్నారు.

టీజీ జెన్‌కో, టీజీ ట్రాన్స్‌ కో, టీజీఎస్‌పీడీసీఎల్‌, టీజీఎన్‌పీడీసీఎల్‌ ఉద్యోగులందరూ నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అందించడంలో నిరంతరం పని చేస్తున్నందుకు అభినందనలు ఉపముఖ్యమంత్రి భట్టి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కూడా విద్యుత్‌ శాఖ ఉద్యోగులందరూ వినియోగదారులకు నిరంతర విద్యుత్‌ సరఫరా అందించడానికి మరింత అంకిత భావంతో పని చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క  పిలుపునిచ్చారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com