29.7 C
Hyderabad
Thursday, June 4, 2026

Live Video

spot_img

టార్గెట్ మస్క్.. టెస్లా కార్లకు నిప్పు..

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టైంది ఇప్పుడు అమెరికాలోని టెస్లా కంపెనీ ఓనర్ల పరిస్థితి. టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌పై ఉన్న కోపం ఇప్పుడు ఆ కంపెనీ కార్ల డీలర్‌ షీప్, కార్ ఓనర్లపై చూపిస్తున్నారు నిరసనకారులు. ఇప్పటికే DOGE తీసుకుంటున్న ఉద్యోగ కోతలకు సంబంధించిన నిర్ణయాలు.. మస్క్‌ కంపెనీ టెస్లాపై పడుతున్నాయి. ఆ కారు షోరూమ్‌ల ముందు నిరసన తెలుపుతున్నారు. ఆ కార్లను కొనొద్దంటూ డిమాండ్లు చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఆ కంపెనీ కార్లను తగులపెట్టారు నిరసనకారులు.

లాస్‌ వెగాస్‌లో ఐదు టెస్లా కార్లకు దుండగులు నిప్పు అంటించారు. కాన్సాస్‌లో రెండు టెస్లా సైబర్ ట్రక్కులకు నిప్పు అంటించారు. ఇక సౌత్ కరోలినాలో టెస్లా చార్జింగ్ స్టేషన్‌కు నిప్పు అంటించే ప్రయత్నం చేశాడు.ఇలా వరుస ఘటనలు టెస్లాను టార్గెట్‌ చేసుకొని జరుగుతున్నాయి. అయితే ఈ ఘటనల్లో ఫైర్ సిబ్బంది వెంటనే రియాక్ట్ అయ్యి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ఇలా వరుసగా ఆందోళనలు, దాడులు జరుగుతుండటంతో మస్క్‌ రెస్పాండ్ అయ్యాడు. ఇవన్నీ ఉగ్రవాద చర్యలే అన్నారు. టెస్లా కేవలం కార్లు తయారు చేసే కంపెనీలే కానీ.. ఎవరికి ఎలాంటి హానీ తలపెట్టలేదు కదా అంటూ పోస్ట్ చేశారు. ఇప్పటికైనా ఈ వెర్రీ పనులు మానుకోవాలని సూచించారు.

కాస్ట్ కటింగ్, పనిచేయని ఉద్యోగులను తీసేయాలన్న లక్ష్యంతో ఇప్పటికే వేలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది అమెరికన్ ప్రభుత్వం. ఇవన్నీ కూడా మస్క్ లీడ్ చేస్తున్న DOGE ఇచ్చిన సలహాలతోనే ముందుకు వెళుతుంది. ఇప్పుడీవన్ని టెస్లాపై ఎఫెక్ట్ చూపిస్తున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com