37.2 C
Hyderabad
Saturday, April 25, 2026

Live Video

spot_img

సునీతా విలియమ్స్ రాకకు ముహూర్తం ఖరారు

ఇంటర్నేషన్ల స్పేస్ స్టేషన్‌లో 9 నెలలుగా చిక్కకుపోయిన ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ భూమి మీద అడుగుపెట్టబోతున్నారు. వీరు భూమి మీదకు తిరిగి ఎప్పుడు వస్తారో నాసా చెప్పేసింది. అమెరికా లోకల్ టైమ్ ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటల 57 నిమిషాలు.. అంటే భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వారి భూమి మీదకు తిరిగి చేరుకోనున్నారు.

నిజానికి నాసా అంచనా వేసినదానికంటే కాస్త ముందు అనే చెప్పాలి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో 11 మంది ఆస్ట్రోనాట్స్ ఉన్నారు. కొత్తగా వెళ్లినవారిని పాతవారు వర్క్‌ను హ్యాండోవర్ చేస్తున్నారు. అయితే వారు భూమి మీదకు తిరిగి చేరుకునే వరకు అప్రమత్తంగా ఉండాల్సిందే అని చెప్పాలి.

భూమి మీదకు వారి తిరుగు ప్రయాణం కొన్ని గంటలపాటు సాగనుంది. క్రూ డ్రాగన్‌ స్పేస్ షిప్‌లోకి ఎక్కడం.. దానిని జాగ్రత్తగా ISS నుంచి విడదీయడం.. ఆ తర్వాత కక్ష్యలను దాటుకుంటూ భూమి వైపుకు దూసుకొచ్చి ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో ల్యాండ్ కానుంది ఈ స్పేస్ షిప్.

భూమి మీదకు వచ్చిన తర్వాత సునీత, విల్మోర్‌ల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు స్పేస్‌లో 9 నెలల పాటు నాన్‌స్టాప్‌గా గడిపిన వారు ఎవ్వరూ లేరు. ఆ రికార్డును వీరిద్దరు సొంతం చేసుకున్నారు. ఇంతకాలం పాటు అంతరిక్షంలో ఉన్న వీరిపై గురుత్వాకర్షణ శక్తి ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com