వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వైవీసుబ్బారెడ్డికి మాతృవియోగం కలిగింది. 85 సంవత్సరాల సుబ్బారెడ్డి మాతృమూర్తి యర్రం పిచ్చమ్మ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఒంగోలు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కొన్ని రోజులుగా వైద్య చికిత్స చేయించుకుంటున్న సుబ్బారెడ్డి తల్లి యర్రం పిచ్చమ్మ సోమవారం ఉదయం మరణించారు. పార్లమెంట్ సమావేశాల కోసం నిన్ననే ఢిల్లీ వెళ్లిన వైవీసుబ్బారెడ్డి తల్లి మరణ వార్త తెలిసిన వెంటనే హుటాహుటీన ఢిల్లీ నుంచి బయలుదేరి ఒంగోలు చేరుకున్నారు. నేడు ఒంగోలు పట్టణంలోనే యర్రం పిచ్చమ్మ పార్థివదేశం ఉంచుతారు. మంగళవారం సుబ్బారెడ్డి స్వగ్రామం మేదరమెట్లలో తల్లి పిచ్చమ్మ అంత్యక్రియలు జరగనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి యర్రం పిచ్చమ్మ మృతి చెందడం పట్ల మాజా ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పిచ్చమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని జగన్ కోరుకున్నారు. వైఎస్ జగన్ పిచ్చమ్మ పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
- Advertisement with us -