30.6 C
Hyderabad
Thursday, June 4, 2026

Live Video

spot_img

కొడితే కొట్టాలి రా… సిక్స్‌ కొట్టాలి…

6 ప్రభుత్వోద్యోగాలు సాధించిన వెల్దండ ఆణిముత్యం

కుటుంబ సభ్యుల ప్రోద్బలం, కృషి, పట్టుదల వెరసి ఓ గృహిణి ఆరు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించగలిగింది. జనగామ జిల్లా నర్మెట మండలం వెల్దండ గ్రామ నివాసి సంధ్య ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇప్పటి వరకూ ఆరు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉత్తీర్ణత సాధించి జిల్లాకే గర్వకారణంగా నిలిచింది. వెల్దండ గ్రామానికి చెందిన బైరగోని పరశురాములు సతీమణి సంధ్య  2009 నుండి 2018 వరకులో బాసర లోని త్రిబుల్ ఐటీ కళాశాలలో కెమిస్ట్రీ  ఫ్యాకల్టీగా విధులు నిర్వర్తించారు. 2018లో గురుకుల పోస్ట్ గ్రాడ్( పి జి టి )టీచర్ గా చేరి వరంగల్ వెస్ట్ స్కూల్లో విధులు నిర్వహించారు. అదే సమయంలో గురుకుల టీజీటీ, జేఎల్,  పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అనె లిస్ట్ గ్రేడ్ 2 గా ఉద్యోగాలు సాధించి. 2019 సంవత్సరంలో గురుకుల కళాశాలలో డిగ్రీలెక్చరర్  (డి ఎల్)  గా  ఉద్యోగం సాధించి ,జగద్గిరిగుట్టలో విధులు నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. 2025 వ సంవత్సరంలో  ఇటీవల ప్రకటించిన జూనియర్ కళాశాల లెక్చరర్ గా ఎంపిక అయి జనగామ గర్ల్స్ జూనియర్ కళాశాలలో ఉద్యోగం సాధించారు. తన భర్త మరియు కుటుంబ సభ్యులు చాలా కష్టపడి చదివించారని ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని. వివిధ జిల్లాల నుండి విద్యార్థులు, స్నేహితులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. సంధ్య పదవ తరగతి వరకు మల్కాపూర్ ఉన్నత పాఠశాలలో చదువుకొని ఇంటర్ డిగ్రీ  స్టేషన్ ఘన్పూర్  లోపూర్తిచేసి. ఆ తర్వాత  ఎంట్రన్స్ రాసి కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీలో ఎంఎస్సీ కెమిస్ట్రీ సీటు సాధించారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తి చేశారు. చిన్నప్పట్నుంచి చదివే లక్ష్యంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. సంధ్య కి పరుశరాములతో 2012లో  పెళ్లికాగా వారికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. భర్త, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో జేఎల్ సాధించారు ఇలా కుటుంబం బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఆరు జాబులు సాధించడం విశేషం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com