35.9 C
Hyderabad
Thursday, June 4, 2026

Live Video

spot_img

మోస్ట్ వాంటెడ్ అబూ ఖతల్ హతం

పాకిస్థాన్‌లో మిస్టరీ డెత్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే అనేకమంది కీలక ఉగ్రవాదులు, ఉగ్ర నేతలు గుర్తు తెలియని దుండగుల చేతుల్లో హతమయ్యారు. ఇప్పుడీ లిస్ట్‌లో అబూ ఖతల్ పేరు కూడా చేరింది. ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌ లిస్ట్‌లో ఉన్న ఈ ఉగ్రవాదిని కూడా గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు.

అబూ ఖతల్ జమ్ము కశ్మీర్‌లో జరిగిన అనేక ఉగ్రదాడులకు సూత్రధారి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇండియన్ ఆర్మీ ఇతడి గురించి వేటాడుతున్నాయి. అంతేకాదు ఈ ఖతల్ లష్కరే తొయిబా చీఫ్‌ హఫీజ్ సయీద్‌కు ముఖ్య అనుచరుడు కూడా. కశ్మీర్‌లో జరిగిన రాయిసీ, రాజౌరీ దాడుల మాస్టర్ మైండ్ కూడా అబూ ఖతల్ అని గుర్తించి NIA.

గతేడాది జూన్ 9న జరిగిన రాయిసీలో భక్తులపై జరిగిన కాల్పులు.. రాజౌరిలో జరిగిన దాడుల వెనక అబూ ఖతల్ ఉన్నట్టు ఇప్పటికే నేషనల్ ఇన్వెస్టిగేషన్ గుర్తించింది. ఇండియన్ ఆర్మీ కూడా అనేక ఉగ్రదాడుల్లో అతని హస్తం ఉన్నట్టు గుర్తించింది. ప్రస్తుతం ఇండియన్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు అబూ ఖతల్. 2002-03 సమయంలో కశ్మీర్‌లో ఉన్న ఈ ఉగ్రవాది.. పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫక్షర్స్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహించాడు. ఆ తర్వాత టెర్రరిస్ట్ ఫ్యాక్టరీని ఓపెన్ చేసి తన తతంగాన్ని నడిపించాడు.

కానీ ఇప్పటికీ కొన్ని ప్రశ్నలు మాత్రం సమాధానం లేకుండానే మిగిలాయి. అబూ ఖతల్‌ను దుండగులు ఎందుకు మట్టుపెట్టారు? దాడి చేసింది ఎవరు? ఎందుకు చేశారు? అనే విషయాలు మాత్రం మిస్టరీనే

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com