35.9 C
Hyderabad
Thursday, June 4, 2026

Live Video

spot_img

అగ్రరాజ్యంపై ప్రకృతి కన్నెర్ర

అమెరికాలో మళ్లీ తుఫాన్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. మొన్నటి వరకు కార్చిచ్చులతో సతమతమైన అమెరికన్లు.. ఇప్పుడు టోర్నడోల దెబ్బకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వంద కిలోమీటర్ల వేగంతో వీస్తున్న పెనుగాలులకు ఇళ్ల పైకప్పుడు ఎగిరిపోతున్నాయి. ఈ పెనుగాలుల దెబ్బకు మిస్సోరీలోనే ఇప్పటివరకు పది మంది చనిపోయారు. మిస్సోరీలో 12 మంది, ఆర్కన్సాస్‌లో ముగ్గురు, మిస్సిస్సిప్పీలో ఆరుగురు, కాన్సాస్‌లో 8 మంది, టెక్సస్‌లో నలుగురు మరణించారు. ఒక్క ఆర్కన్సాస్‌లోనే 29 మందికిపైగా గాయపడ్డారు.

ఈ పెనుగాలుల కారణంగా కొన్ని చోట్ల కార్చిచ్చులు కూడా మొదలయ్యాయి. ఓక్లమోమా, మిస్సోరి, న్యూ మెక్సికో, టెక్సస్, కాన్సస్‌లలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మిన్నెసొటా, సౌత్ డకోటాలోని పలు ప్రాంతాల్లో మంచు తుఫాన్‌ ముప్పు ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలబామా, కెంటకీ, మిసిసిపీ, టెనసీ, ఇల్లినోయీ, ఇండియానా, టెక్సాస్‌, టెన్నెసీ రాష్ట్రాలకూ ఇంకా టోర్నడోల ముప్పు పొంచి ఉంది.

నిజానికి మార్చి నెలలో ఇలాంటి వాతావరణ పరిస్థితులు అమెరికాలో సాధారణమే. కానీ ఈసారి మాత్రం తీవ్రత చాలా ఎక్కువగా ఉంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com