-
సోషల్ మీడియాలో బూతులపై ఆగ్రహం
-
మీడియాపై చట్టం చేద్దామా?
-
జర్నలిస్టు సంఘాలకు రేవంత్ ప్రతిపాదన
మీడియా పేరుతో సోషల్ మీడియాలో ఇష్టారీతిన వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వార్నింగ్ ఇచ్చారు. తల్లి, చెల్లిని అడ్డం పెట్టుకొని పోస్టులు పెడితే తోడ్కలు తీస్తానంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. జర్నలిస్టులు కాని వాళ్లు అసభ్యకర పోస్టులు పెడితే గుడ్డలూడదీసి కొడతానంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో తన కుటుంబ సభ్యుల పట్ల దారుణమైన రీతిలో పోస్టులు పెడుతున్నారని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ధ్వజమెత్తారు. పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడించి విమర్శిస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. జర్నలిస్టుల ముసుగులో అసాంఘిక భాష వాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జర్నలిస్టులకు విధి విధానాలు నిర్ణయిస్తామని అన్నారు. ఇకపై.. హద్దు దాటితే ఊరుకునేది లేదన్నారు.అమ్మ, చెల్లిపై పోస్టులు పెడ్తే ఊకుంటరా.. ఉరికిచ్చి కొడ్తరు అని మండిపడ్డారు. జర్నలిస్టు ముసుగేసుకొని వస్తే బట్టలూడదీసి కొడ్తనన్నారు. ఆడబిడ్డల మీద పోస్టులు పెడ్తె తోడ్కలు తీస్తనని హెచ్చరించారు.
‘‘పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి పార్టీ ఆఫీసులో పెడుతున్నారు. వాళ్లు రికార్డు చేసి సోషల్ మీడియాలో పెడితే పోలీసులు కేసు పెట్టారు. వారు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన భాషను ఒకసారి చూడండి. ఇష్టారాజ్యంగా మాట్లాడితే వాళ్లు జర్నలిస్టులు అవుతారా?’’ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
“ఐ అండ్ పీఆర్ లేదా డీఏవీపీ ఆమోదించిన పత్రికలు, ప్రసార సాధనాల వాళ్లు ఇచ్చిన ఐడీ కార్డులు ఉన్నవాళ్లు జర్నలిస్టులా, లేక, ఎవడు పడితే వాడు ఏదో ఒక టీవీ, యూట్యూబ్ చానల్ పెట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడేవాళ్లు జర్నలిస్టులా? మమ్మల్ని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ఓపిక పడుతున్నాం… ఆ భాష వింటుంటే రక్తం మరుగుతోంది. కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే… మీరసలు మనుషులే అని వాళ్లను అడుగుతున్నా. మీకు భార్యాబిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? ట్విట్టర్ లో తప్పుడు వ్యాఖ్యలతో పోస్టులు పెడుతున్న వాళ్లను అరెస్ట్ చేస్తే, ఆ అరెస్టులను ఖండిస్తున్నారు… మీ అమ్మనో, మీ భార్యనో, మీ చెల్లినో ఈ రకంగా మాట్లాడితే నువ్వు వింటావా? అని ఆ అరెస్టులను ఖండించే వారిని ప్రశ్నిస్తున్నా. నా భార్యను, నా బిడ్డను మాట్లాడుతుంటే నాకు నొప్పి కలుగుతుంది కానీ… ఓ ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కలగదా? ఏ సంస్కృతిలో ఉన్నావు నువ్వు? ముఖ్యమంత్రిగా చెబుతున్నా… తోలు తీస్తా ఒక్కొక్కడికీ! బట్టలు విప్పదీసి రోడ్డు మీది తిప్పిస్తా! రాజకీయాల్లో ఉన్నది నేను.. నా గురించి మాట్లాడండి, విమర్శించండి, విశ్లేషించండి… ఇంట్లో ఉన్న ఆడవాళ్లను గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడ్నించి వచ్చింది? ఈ విధంగా తెలంగాణ సంస్కృతిని విషపూరితం చేస్తున్నారు… నోటికొచ్చింది మాట్లాడి వాటిని పోస్టులుగా పెట్టించి పైశాచిక ఆనందం పొందుతున్నారు. వాళ్లు తిట్టిన తిట్లకు అక్కడ నా పేరు తీసేసి మీ పేరు రాసుకోండి… మీకు అన్నం తినబుద్ధి అవుతుందేమో చూస్తా! తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అంత బలహీనుడు అనుకుంటున్నారా? ఇన్నాళ్లు ఓపిక పట్టాను కాబట్టి సరిపోయింది… మీకెంతమంది ఉన్నారో తెలియదు… నాకు చికాకు కలిగిందని తెలిస్తే లక్షలాది మంది పిల్లలు రోడ్డు మీదికి వచ్చి ఒక్కొక్కరిని బట్టలిప్పదీసి కొడతారు. నేను వద్దంటున్నాను కాబట్టి వారు ఆగుతున్నారు. చట్టాల పట్ల, శాసనాల పట్ల, భారత రాజ్యాంగం పట్ల సంపూర్ణ విశ్వాసం సికంగా కుంగదీసి, దెబ్బతీసి రాజకీయంగా ప్రయోజనం పొందుదామని అనుకుంటున్నావేమో!… అలా అని కలలు కంటున్నావేమో… ఇక కుదరదు చంద్రశేఖర్ రాఉంది కాబట్టి సంయమనం పాటిస్తున్నా… అంతే తప్ప మాకు చేతకాక కాదు. చంద్రశేఖర్ రావు గారూ… మీ పిల్లలకు చెప్పు… ఇది మంచిది కాదు… ఇలా ఏదో చేసి మానవ్! హద్దు దాటినా, మాట జారినా దాని ఫలితం అనుభవిస్తారు” అంటూ రేవంత్ రెడ్డి ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.
‘చట్ట పరిధిలోనే అన్ని చర్యలు ఉంటాయి. సోషల్ మీడియాపై చర్చ పెట్టండి. విశ్రుంఖలత్వం ఆపండి. పరిష్కారం చూపకపోతే సమాజాన్ని దెబ్బ తీస్తారు. చట్ట సభలో చట్టం చేద్దాం. నా ఒక్కరి ఆవేదన కాదు.. అందరి ఆవేదన. అందరూ సహకరించాలి. స్వీయ నియంత్రణతో పాటు రాజ్యాంగ నియంత్రణ ఉండాలి.’ అని రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే ఈ పరిణామాలపై జర్నలిస్టు సంఘాలకు కూడా రేవంత్ రెడ్డి సలహా ఇచ్చారు. ‘జర్నలిస్టు సంఘాలు లిస్టు ఇవ్వండి.. జర్నలిస్టు తప్పుచేస్తే మీరే శిక్షించండి.’ అని సూచించారు.