35.2 C
Hyderabad
Saturday, April 25, 2026

Live Video

spot_img

రాశిఫలాలు… 16.03.25· నుండి 22.03.25 వరకు

ఈవారం పండగలు–పర్వదినాలు…

17, సోమవారం, సంకటహర చతుర్ధి

మేషం… (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

కొన్ని పనుల్లో జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు.మిత్రులతో కొద్దిపాటి వివాదాలు. ఆస్తుల విషయంలో కోర్టు వివాదాలు కొలిక్కి వస్తాయి.సంఘంలో గౌరవప్రతిష్టలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఉత్సాహాన్నిస్తుంది.దేవాలయ దర్శనాలు. వివాహాది శుభకార్యాలలో పాలుపంచుకుంటారు. రాబడి పెరిగి అవసరాలు తీరతాయి. రుణబాధలు తీరతాయి. షేర్ల విక్రయాల ద్వారా మరింత సొమ్ము అందుతుంది.బంధువర్గంతో నెలకొన్న సమస్యలు పరిష్కరించుకుంటారు. వివాహాది వేడుకలు నిర్వహిస్తారు. స్వల్ప రుగ్మతలు బాధిస్తాయి. వైద్యసేవలు పొందుతారు.వ్యాపారాలకు కొత్త వ్యాపార యత్నాలు కలసివస్తాయి. ఆశించినంత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ప్రశంసలు అందుతాయి.రాజకీయవర్గాలకు పదవులు ఊరిస్తాయి, విదేశీ పర్యటనలు ఉంటాయి. మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. 16,17 తేదీల్లో అర్థిక ఇబ్బందులు, దూరప్రయాణాలు. మానసిక ఆందోళన. కొన్ని చికాకులు. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.

వృషభం… (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, వృగశిర 1,2 పాదాలు)

పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కొత్త కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కించుకుంటారు.ఆలయాలు సందర్శిస్తారు.విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తుంది.ఆస్తి వివాదాలు కొంతవరకూ పరిష్కారమవుతాయి.అత్యంత విలువైన వస్తువులు సేకరిస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. రుణబాధలు తొలగి ఊరట చెందుతారు. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. సోదరులు, సోదరీల ప్రేమాభిమానాలు పొందుతారు. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలు. వైద్యసేవలు పొందుతారు. వ్యాపారాలలో లాభనష్టాలు సమానస్థాయిలో ఉంటాయి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు ఊరట కలిగిస్తాయి. రాజకీయవర్గాల కు కొత్త పదవులు వరిస్తాయి. ఒత్తిడులు తొలగుతాయి. మహిళలకు నూతనోత్సాహం, ఆహ్వానాలు అందుతాయి. 21,22 తేదీల్లో వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమ మరింత పెరుగుతుంది. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మిథునం… (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు).

కొత్త విషయాలు గ్రహిస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు.వాహనాలు, భూములు  కొనుగోలు చేస్తారు. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు.తీర్థయాత్రలు చేస్తారు.ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యతిరేక పరిస్థితులు సైతం అనుకూలంగా మార్చుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతారు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. భూముల విక్రయాలు పూర్తి చేసి సకాలంలో సొమ్ము అందుకుంటారు. అందరితోనూ సంతోషకరంగా గడుపుతారు. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. సోదరులు, సోదరీలతో సఖ్యత ఏర్పడుతుంది. ఆరోగ్యం కొంత మెరుగ్గా ఉండి ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో కొత్తపెట్టుబడులతో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో కోరుకున్న విధంగా పదోన్నతులు దక్కడం విశేషం. కళాకారులలో కొత్త ఆశలు చిగురిస్తాయి. అనుకోని అవకాశాలు. మహిళలకు పురస్కారాలు అందుతాయి. 17,18 తేదీల్లో కీలక నిర్ణయాలలో మార్పులు. మనస్సు చంచలంగా ఉంటుంది. దూరప్రయాణాలు. ఒప్పందాలను వాయిదా వేస్తారు. గణపతి స్తోత్రాలు పఠించండి

కర్కాటకం… (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష).

సన్నిహితులు, మిత్రుల చేయూతతో ముందుకు సాగుతారు.రెట్టించిన  ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి.ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు.సొమ్ముకు లోటు రాదు. రుణాలు తీరతాయి. రెండుమూడు విధాలుగా సొమ్ము అందుతుంది. కుటుంబసమస్యల బారి నుంచి బయటపడతారు. శుభవార్తలు అందుతాయి. సంతానపరంగా కొన్ని ఇబ్బందులు తీరతాయి. కొంత నలత చేసి ఉపశమనం పొందుతారు. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు సమకూరతాయి, లాభాలకు లోటు రాదు. ఉద్యోగాలలో పదోన్నతి సూచనలు, పైస్థాయి అధికారుల నుంచి కీలక సమాచారం. కళాకారులు అందిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. మహిళలు కుటుంబంలోనూ, బయటా గౌరవమర్యాదలు పొందుతారు. 18,19 తేదీల్లో శ్రమ తప్ప ఫలితం శూన్యం. వృథా ధనవ్యయం. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అనారోగ్యం. ఆదిత్యహృదయం పఠించండి.

సింహం… (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

వ్యవహారాలలో అవాంతరాలు ఎదురవుతాయి. కష్టం మీది ఫలితం మరొకరిదిగా ఉంటుంది. సన్నిహితులతో అకారణంగా విరోధాలు.  తరచూ తీర్థయాత్రలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రత్యర్థులతో మరింత జాగ్రత్తలు పాటించండి. సొమ్ములు చేతికందక ఇబ్బంది తప్పదు. రుణాలు సైతం చేస్తారు. ఒకరికి ఇచ్చిన హామీకి కట్టుబడి వారికి కొంత సర్దుబాటు చేసేందుకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. అందరితోనూ వివాదాలు నెలకొంటాయి. మీరు వాస్తవాలు మాట్లాడినా విమర్శలు తప్పకపోవచ్చు.  కొంత నలత చేసి ఇబ్బంది పడతారు. వైద్యసలహాలు పాటిస్తారు. వ్యాపారాలలో స్వల్పలాభాలు అందుతాయి. పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు ఉండవచ్చు. ఉన్నతాధికారులతో మాటపడతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒత్తిడులు. మహిళలకు మానసిక అశాంతి. 19,20 తేదీల్లో శుభవార్తలు వింటారు. ఊహించని ధనలాభం. ఉద్యోగయత్నాలు సఫలం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కన్య… (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)

పట్టింది బంగారమే. కొత్త కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ ప్రతిభాపాటవాలకు గుర్తింపు లభిస్తుంది. చిరకాల మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. సొమ్ములకు లోటులేని విధంగా గడిచిపోతుంది. రుణబాధలు సైతం తీరతాయి. షేర్లలోనూ పెట్టుబడులు పెడతారు. అందరితోనూ సఖ్యత నెలకొంటుంది. సోదరులతో ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి తెచ్చుకుంటారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. స్వల్ప అనారోగ్యం, ఔషధసేవనం. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగుల పనిభారం తగ్గుతుంది. ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయవర్గాలకు సన్మానాలు. మహిళలు కుటుంబసభ్యుల చేయూతతో కొన్ని విజయాలు సాధిస్తారు. 21,22 తేదీల్లో ఏ కార్యక్రమం చేపట్టినా ముందుకు సాగదు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో అవాంతరాలు. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

తుల… (చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)

ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయం. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి సంతోషకరమైన వార్తలు.నిరుద్యోగులకు ఉద్యోగలాభం. యత్నకార్యసిద్ధి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.వాహనాలు, స్థలాలు, ఆభరణాలు కొంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు. ఒక స్నేహితుని ద్వారా ధనలాభం కలుగుతుంది.శుభకార్యాలతో సందడిగా గడుపుతారు. సోదరులు, బంధువులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యలు తీరతాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. క్రమేపీ విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఉద్యోగులలో ప్రమోషన్లు సంతోషం కలిగిస్తాయి. రాజకీయవర్గాలు పదవులు దక్కించుకుంటారు. కళాకారులకు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. మహిళలకు ఆస్తిలాభం కలుగుతుంది. శుభవర్తమానాలు. 17,18 తేదీల్లో ఆర్థికంగా ఇబ్బందులు. ప్రయాణాలలో అవాంతరాలు. ఆప్తులతో విభేదాలు. చోరభయం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం… (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

సన్నిహితులతో మాటపట్టింపులు. ఇంటాబయటా విమర్శలు ఎదురవుతాయి. కాంట్రాక్టులు చివరిలో చేజారతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. కొన్ని వ్యవహారాలు శ్రమానంతరం పూర్తి కాగలవు. కష్టానికి ఫలితం స్వల్పమే. మీ అభిప్రాయాలను గమనించి మిత్రులు కొంత కలత చెందుతారు. రావలసిన సొమ్ము అందడంలో జాప్యం. కొత్తగా రుణాలు చేస్తారు. సోదరీలు, సోదరులతో కలహాలు. సంతానపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. కొంత నలత చేసి ఇబ్బంది పడతారు. అయితే, క్రమేపీ ఉపశమనం పొందుతారు. వ్యాపారాలకు అనుకున్న లాభాలు దక్కక కొంత ఇబ్బంది పడతారు. ఉద్యోగాలలో ఆకస్మిక బదిలీలు ఉంటాయి. పారిశ్రామికవర్గాలు విదేశీ పర్యటనలు వాయిదా వేసుకుంటారు. మహిళలకు ఆస్తి విషయాలలో కుటుంబసభ్యులతో వివాదాలు. 19,20 తేదీల్లో వివాదాలకు దూరంగా ఉండండి. కొన్ని కార్యక్రమాలు అతికష్టంపై పూర్తి చేస్తారు. వృథా ఖర్చులు. శ్రమాధిక్యం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు… (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)

అనుకున్న పనులు కొంతనిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులతో అకారణంగా తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రత్యర్థులు మీపట్ల కొంత కఠినంగా వ్యవహరిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్యవిషయాలు చర్చిస్తారు. కాంట్రాక్టులు చేజారవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సమయానికి డబ్బు అందక నిరాశ చెందుతారు. రుణదాతలు మరోవైపు ఒత్తిడులు పెంచుతారు. సోదరులతో కలహాలు. మీ శ్రమను కుటుంబసభ్యులు గుర్తించకపోవడంతో మదనపడతారు. తరచూ రుగ్మతలతో బాధపడతారు. వైద్యసేవలు అవసరం కావచ్చు. వ్యాపారాలు. క్రమేపీ లాభిస్తాయి. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఉద్యోగాలలో ఇష్టంలేని మార్పులు సంభవం. విధుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. మహిళలకు మానసిక ఆందోళన. 21,22 తేదీల్లో పరిస్థితుల ప్రభావంతో నిర్ణయాలు మార్చుకుంటారు. రుణదాతల ఒత్తిడులు. ప్రయాణాలలో ఆటంకాలు. దైవచింతన. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

మకరం… (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)

అనుకున్న కార్యక్రమాలలో అవాంతరాలు. సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. విద్యార్థుల యత్నాలు మందకొడిగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఎంతగా ప్రయత్నించినా సొమ్ములు అందక ఇబ్బంది పడతారు. కొంత సొమ్ము చేజారే వీలుంది, షేర్లలోనూ పెట్టుబడుల్లో తొందరపాటు వద్దు. మీపై ప్రేమ చూపిన వారే ఎదురుతిరిగి సమస్యలు సృష్టించే వీలుంది, సోదరులతో అకారణంగా విరోధాలు. సంతానపరంగా కొన్ని చికాకులు తప్పవు. రుగ్మతలు బాధిస్తాయి. వైద్యసలహాలు పొందుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు కష్టమే. పెట్టుబడుల్లోనూ నిదానం పాటించండి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు ఉండవచ్చు. పైఅధికారుల నుంచి ఒత్తిడులు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒత్తిడులు మరింత పెరుగుతాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు తప్పవు. 20,21 తేదీల్లో బాధ్యతలు మరింత పెరుగుతాయి. అంచనాలు తారుమారు. కీలక నిర్ణయాలు వాయిదా వేస్తారు. ఒత్తిడులు తప్పకపోవచచు. శివాష్టకం పఠించండి.

కుంభం… (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

పనులు చకచకా సాగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. మిత్రుల నుంచి శుభవర్తమానాలు. దూరప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. గృహ నిర్మాణాలు చేపడతారు. రావలసిన డబ్బు చేతికందుతుంది. బంధువుల ద్వారా ఆకస్మిక ధనలబ్ధి. అప్పుల బాధలు తొలగుతాయి. మీపై బంధువులు మరింత ప్రేమ చూపుతారు. వివాహాది వేడుకలు నిర్వహిస్తారు. కొద్దిపాటి రుగ్మతలు బాధిస్తాయి. వ్యాపారాలలో కొత్తపెట్టుబడులు సమకూరి లాభాల దిశగా పయనిస్తారు. ఉద్యోగులలో విధినిర్వహణలో ప్రశంసలు అందుతాయి. రాజకీయవర్గాలు పదవులు దక్కించుకుంటారు. సన్మానాలు జరుగుతాయి. మహిళలు కుటుంబసభ్యుల చేయూతతో నిర్ణయాలు తీసుకుంటారు. 16,17 తేదీల్లో ఇంతకాలం పడిన కష్టం వృథా కాగలదు. ప్రయాణాలలో మార్పులు. సన్నిహితులతో మాటపట్టింపులు. కనకధారాస్తోత్రాలు పఠించండి.

మీనం… (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర, రేవతి).

ఓర్పుతో ముందుకు సాగి కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు.మీ నిర్ణయాలను కుటుంబసభ్యులు అభినందిస్తారు.కృషితో కొన్ని విజయాలు సాధిస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగలాభం.ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు.కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు చిగురిస్తాయి.దేవాలయాలు సందరిస్తారు. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. షేర్లు, స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు. సోదరులు, సోదరీలతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. వాక్పటిమతో బ«ంధువులను ఆకట్టుకుంటారు. వేడుకలు నిర్వహిస్తారు. కొద్దిపాటి రుగ్మతలు నెలకొన్నా సర్దుబాటు కాగలవు. వ్యాపారాలలో అనూహ్యంగా పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. కొన్ని సమస్యలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వపరంగా సహకారం అందుతుంది. మహిళలు కుటుంబసమస్యలు ఎదురైనా పరిష్కరించుకుంటారు. 17,18 తేదీల్లో దూరప్రయాణాలు. మానసిక ఆందోళన. శ్రమాధిక్యం. కొన్ని నిర్ణయాలలో తొందరపాటు. ఆరోగ్యం సహకరించదు. విష్ణుధ్యానం చేయండి.

—————————–

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com