30.7 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

జగదీష్‌రెడ్డి సస్పెన్షన్‌పై పునఃపరిశీలన చేయండి

స్పీకర్‌కి విజ్ఞప్తి చేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్వరరెడ్డిపై బడ్జెట్‌ సమావేశాలు మెత్తం విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని బీఆర్‌ఎస్‌ శాసనసభ్యులు స్పీకర్‌ గడ్డ ప్రసాద్‌ కుమార్‌కి విజ్ఞప్తి చేశారు. శనివారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు బీఆర్‌ఎస్‌ సభ్యులు స్పీకర్‌ ఛాంబర్‌కు వెళ్ళి జగదీష్‌రెడ్డి సస్పెన్షన్‌ ఎత్తివేయాలని అభ్యర్థించారు. జగదీష్‌రెడ్డి ఎక్కడా స్పీకర్‌ను ఏక వచనంతో సంబోధించలేదని బీఆర్‌ఎస్‌ శాసనసభ్యులు స్పీకర్‌కు వివరించారు. జగదీష్‌రెడ్డి సభా సంప్రదాయాలను ఏ దశలోనూ ఉల్లంఘించలేదని ఆయన సస్పెన్షన్‌ అక్రమం, అన్యాయమని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ దృష్టికి తీసుకువెళ్ళారు. ఇదేవిషయాన్ని మాజీ మంత్రి హరీష్‌ రావు అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. జగదీష్‌రెడ్డికి ఎక్కడా దురుద్దేశాలు లేవని, ఆయన స్పీకర్‌ను ఎప్పుడూ ఏకవచనంతో సంబోధించలేదని మరోసారి సభలో హరీష్‌రావు పునరుద్ఘాటించారు. జగదీష్‌రెడ్డి సస్పెన్షన్‌పై పునఃపరిశీలన చేయాలని హరీష్‌ రావు శాసనసభలో స్పీకర్‌ని కోరారు. శనివారం ఉదయం స్పీకర్‌ని ఆయన ఛాంబర్‌లో కలసిన బీఆర్‌ఎస్‌ శాసనసభ్యుల్లో హరీష్‌రావుతో పాటు సబితా ఇంద్రారెడ్డి, సుధీర్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మాధవరం కృష్ణారావు, కేపీవివేకానంద ప్రభృతులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com