25.2 C
Hyderabad
Monday, July 27, 2026

Live Video

spot_img

దిగొచ్చిన అంబానీ – మస్క్‌తో స్టార్‌లింక్ ఒప్పందం

  • స్పెక్ట్రమ్ సర్వీసుల వేలం కోసం ముఖేష్‌ పట్టు

  • పరిపాలనా పరంగా కేటాయింపులుండాలన్న మస్క్

  • ఎయిర్‌టెల్‌,స్టార్‌లింక్ ఒప్పందంతో కంగుతిన్న ముఖేష్‌

  • దిగొచ్చిన అంబానీ జియో కంపెనీ, మస్క్‌తో ఒప్పందం

  • జియో రిటైల్‌ అవుట్‌లెట్‌లలో స్టార్‌లింక్ ఎక్విప్‌మెంట్‌ అమ్మకాలు

  • ఆన్‌లైన్‌లోనూ, ఫ్రంట్‌ స్టోర్స్‌లో కూడా లభ్యం

  • మస్క్ స్టార్‌లింక్‌కు ఇంకా దక్కని అధికారిక అనుమతులు

  • అనుమతులు వచ్చాకే ఎయిర్‌టెల్‌, జియో ఒప్పందాల అమలు

  • అతిపెద్ద మొబైల్‌ డేటా ట్రాఫిక్ ఆపరేటర్‌గా జియో

  • తక్కువ ఎత్తు నుంచి ఉపగ్రహ రాశులను ఆపరేట్‌ చేసే స్టార్‌లింక్‌

భారతి ఎయిర్ టెల్‌ స్టార్ లింక్ తో ఒప్పందం చేసుకుని 24 గంటలు గడవక ముందే స్పెక్ట్రమ్‌ సర్వీసుల వేలం కోసం మంకు పట్టు పడుతున్నరిలయెన్స్ జియో నేలకు దిగొచ్చింది. తాము కూడా స్టార్ లింక్ తో ఒప్పందం చేసుకున్నామని జియో స్టోర్స్ రిటైల్‌ అవుట్ లెట్స్ లో,ఆన్ లైన్ స్టోర్‌ ఫ్రంట్స్ లోనూ స్టార్ లింక్ పరికరాలు దొరుకుతాయని జియో ప్రకటించింది.స్టార్ లింక్ ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి తెచ్చామని ఎయిర్ టెల్‌ ప్రకటించిన రోజు తర్వాత అంబానీ తమ జియో కంపెనీ కూడా స్టార్ లింక్ తో టై అప్ పెట్టుకుందని స్టార్ లింక్ ఇంటర్నెట్‌ సర్వీసులు అందిస్తుందని ప్రకటించారు.అయితే స్టార్ లింక్ ఇండియాలో అమ్ముకోడానికి అన్ని అధికారిక అనుమతులు సంపాదించిన తర్వాతే ఈ ఒప్పందం అమల్లోకి వస్తుంది. మస్క్ తో కుదిరిన ఈ ఒప్పందం వల్ల ప్రపంచంలోకే అతిపెద్ద మొబైల్‌ డాటా ట్రాఫిక్ ఆపరేటర్ గా జియో ఖ్యాతిని రెండు కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం కూడా కల్పిస్తాయి. అదే సమయంలో భూమికక్ష్య కి అతి తక్కువ ఎత్తునుంచి పరిభ్రమించే ఉపగ్రహ రాశులను ఆపరేట్‌చేస్తూ దేశవ్యాప్తంగా బ్రాడ్‌ బ్యాండ్‌ సర్వీసులను అందించే శక్తి వంతమైన వ్యవస్థగా స్టార్ లింక్ కు ప్రచారం కూడా దక్కుతుంది. జియో రిటైల్‌ అవుట్‌ లెట్‌ స్టోర్స్ లో స్టార్ లింక్ ఎక్విప్ మెంట్‌ అమ్మడమే కాక కస్టమర్ సర్వీస్ ఇన్ స్టాలేషన్, యాక్టివేషన్ సేవలను కూడా అందిస్తుందని జియో మీడియా బ్రీఫ్‌లో తెలిపింది.

జియోకి సైలెంట్‌ రిటార్ట్ ఇచ్చిన ఎయిర్ టెల్‌ :

శాటిలైట్‌ సర్వీసులకు స్పెక్ట్రమ్ సేవలను ఎలా పంపిణీ చేయాలన్న అంశంపై ప్రభుత్వానికి, జియో కంపెనీకి మధ్య ఘర్షణ జరుగుతున్న సమయంలోనే ఎయిర్ టెల్‌ కంపెనీ ముందు స్టార్ లింక్ తో ఒప్పందం కుదుర్చుకుంది. స్పెక్ట్రమ్ సేవలను వేలం వేయాలని ముఖేష్‌ అంబానీ కొంతకాలంగా పట్టుబడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం ఎలన్ మస్క్ ప్రతిపాదనలకు ఓకే చేసింది. మస్క్ కూడా స్పెక్ట్రమ్ కేటాయింపులు ప్రపంచ ప్రమాణాలకు సమానంగా పరిపాలనా పరంగానే కేటాయింపులు జరపాలని అభిప్రాయపడ్డారు.ప్రభుత్వం కూడా ఇందుకే సిద్ధపడింది. ముఖేష్ అంబానీ మూర్ఖంగా వేలం వేయాలని వాదిస్తుండగా, ఎయిర్ టెల్‌ కంపెనీ సైలెంట్‌ గా స్పేస్ ఎక్స్ తో ఒప్పందం కుదుర్చేసుకుంది.స్టార్ లింక్ తో తమ ఒప్పందం వల్ల బ్రాడ్‌ బ్యాండ్ సేవలు మరింత పకడ్బందీగా, నిరంతరాయంగా, వేగంగా అందుతాయని, తదుపరి తరానికి ఉపగ్రహ కనెక్టివిటీ చాలా బాగా ఉపయోగపడుతుందని భారతీ ఎయిర్ టెల్‌ మేనేజింగ్‌ డైరక్టర్ గోపాల్‌ విట్టల్ అన్నారు

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com