36.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

పాక్‌లో ట్రైన్ హైజాక్

పాకిస్థాన్‌లో ట్రైన్ హైజాకైంది. బలూచిస్థాన్‌ లిబరేషన్ ఆర్మీ మిలిటెంట్లు ఏకంగా ఓ ట్రైన్‌పై దాడి చేసి దానిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ రైలులో పాక్ ఆర్మీ, పోలీస్, ఇంటెలిజెన్స్, యాంటీ టెర్రరిజమ్ ఫోర్స్‌ కు చెందిన సైనికులు, అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. దాడి సమయంలో రైలులో 400 మంది ప్రయాణీకులు ఉన్నారు. అయితే మిలిటెంట్ దాడుల్లో ఆరుగురు పాక్ జవాన్లు మృతి చెందినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం వంద మందికిపైగా BLA ఆధీనంలో ఉన్నట్టు తెలుస్తోంది. ట్రైన్‌లో ఉన్న మహిళలు, పిల్లలు, బలూచిస్థాన్ ప్రజలను వదలిపెట్టిన BLA.. పాక్‌ ఆర్మీలో పనిచేస్తున్న వారిని, సహకరిస్తున్న వంద మందిని మాత్రం తమ అదుపులో ఉంచుకుంది. ఈ హైజాక్‌పై ఇప్పటికే స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది BLA. రైల్వే ట్రాక్‌ను పేల్చేసి జఫ్ఫార్ ఎక్స్‌ప్రెస్‌ను కంట్రోల్‌లోకి తీసుకున్నామని ప్రకటించింది BLA.

ఈ దాడికి పాల్పడింది BLAకు చెందిన మజీద్ బ్రిగేడ్, ఫతే స్క్వాడ్‌ అని ప్రకటించింది. అంతేకాదు బందీలను విడిపించేందుకు ఏదైనా చర్యలు తీసుకుంటే మాత్రం తగిన గుణపాఠం చెబుతామని వార్నింగ్ ఇచ్చింది BLA. అంతేకాదు ఇకపై బలూచిస్థాన్‌లో ఎలాంటి మిలటరీ ఆపరేషన్ నిర్వహించకూడదని వార్నింగ్ ఇచ్చింది. వీటిలో ఏది జరిగినా బంధీల ప్రాణాలు పోతాయంది.

గత కొన్ని రోజులుగా పాక్ ఆర్మీని టార్గెట్‌గా చేసుకొని దాడులకు పాల్పడుతోంది BLA. రీసెంట్‌గా జరిపిన దాడుల్లో పదుల సంఖ్యల్లో పాక్ ఆర్మీ జవాన్లను మట్టుపెట్టింది. ఇప్పుడు ఏకంగా ఓ ట్రైన్‌నే హైజాక్ చేసింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com