36.1 C
Hyderabad
Monday, June 15, 2026

Live Video

spot_img

శ్రీవారికే శఠగోపం…పరకామణిలో గోల్‌మాల్‌

  • చెన్నై టీటీడీ ఆలయం పరకామణిలో గోల్‌మాల్‌
  • సీనియర్ అసిస్టెంట్ కృష్ణకుమార్ చేతివాటం
  • భక్తులు సమర్పించిన విదేశీ కరెన్సీ మాయం

చెన్నై నగరంలో తిరుమల తిరుపతి దేవస్ధానంలో ఉన్న వెంకటేశ్వరస్వామి దేవాలయం పరకామణిలో అవకతవకలు జరిగినట్లు టీటీడీ విజిలెన్స్‌ విభాగం గుర్తించింది. చెన్నై టీటీడీ శ్రీవారి ఆలయంలో పని చేసే సీనియర్‌ అసిస్టెంట్‌ కృష్ణకుమార్‌ చేతి వాటం ప్రదర్శించి భక్తులు స్వామివారికి సమర్పించిన విదేశీ కరెన్సీని స్వాహా చేసినట్లు టీటీడీ విజిలెన్స్‌ విభాగం కనుగొంది. దేశ వ్యాప్తంగా టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో హుండీ ద్వారా వచచిన ఆదాయాన్ని ప్రతి నెల 1వ తేదీన తిరుమలలోని పరకామణిలో జమ చేయాలి. అయితే చెన్నై టీటీడీ ఆలయంలో హుండీ లెక్కింపులో సీనియర్ అసిస్టెంట్‌ కృష్ణకుమార్‌ స్వామివారికి భక్తులు కానుకగా ఇచ్చిన విదేశీ నగదును తస్కరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గత సంవత్సరం ఒక నెలలో ఏకంగా ఆరు లక్షల విదేశీ కరెన్సీ తస్కరణకు గురయ్యింది. అయితే చెన్నై టీటీడీ దేవాలయంలో విదేశీ కరెన్సీ లెక్కింపుల్లో తేడాలు జరిగినట్లు తిరుమల తిరుపతి దేవస్ధానం విజిలెన్స్‌ వింగ్‌ గుర్తించడం జరిగింది. దీంతో సమగ్ర విచారణ జరిపిన విజిలెన్స్‌ అధికారులు టీటీడీ ఈవో శ్యామలరావుకు నివేదిక సమర్పించారు. విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా చెన్నై టీటీడీ దేవాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కృష్ణకుమార్ని ఈవో శ్యామలరావు స్పెండ్‌ చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com