ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. అత్యంత విచారకరమైన ఈ సంఘటన ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఓయూ పీఎస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర నాయక్ తెలిపిన వివరాల ప్రకారం చంద్ర శేఖర్ రెడ్డి అనే వ్యక్తి హబ్సిగూడాలోని రవీంద్ర నగర్ లో గత ఎనిమిది నెలలుగా అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య కవిత 13 సంవత్సరాల వయసు గల కమార్తె శ్రీతా రెడ్డి, పది సంవత్సరాల వయసు గల కుమారుడు విశ్వంత్ రెడ్డి ఉన్నాయిరు. అయితే చంద్రశేఖర్ రెడ్డి ఓ ప్రయివేటు జూనియర్ కళాశాలలో లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. గత ఆరు నెలల క్రితం ఉద్యోగం వదిలేసి ఖాళాగా ఉంటున్నాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో సోమవారం రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో బాబు కు విషం ఇచ్చి పాపను ఊరి వేసి వారు చనిపోయారు అని నిర్ధారించుకున్న తరువాత బార్యా భర్తలు చెరో గదిలో ఊరి వేసుకొని ఆత్మహత్యా చేసుకున్నారు.చంద్రశేఖర్ రెడ్డి స్వగ్రామం మహబూబ్ నగర్ జిల్లా కడ్తాల్. ఆత్మహత్య జరిగినట్లు చుట్టుపక్కల వారు గమనించి 100 ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. చనిపోయిన మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఓయూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.