37.2 C
Hyderabad
Saturday, May 30, 2026

Live Video

spot_img

కువైట్‌ గల్ఫ్‌ కప్‌ సెలబ్రేషన్స్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీ వేడుకలుగా వైరల్‌ – భాస్కర న్యూస్‌ నిజ నిర్ధారణ

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీని టీమిండియా గెలుచుకుంది. న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన ఫైనల్‌లో భారత్‌ అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. పుష్కర కాలం తర్వాత భారత్‌ ఐసీసీ ట్రోఫీ సొంతం చేసుకోవడంతో, దేశమంతటా సంబరాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్‌ వ్యాప్తంగా కూడా యూత్‌ రోడ్ల మీదకు వచ్చి కేరింతలు కొట్టారు. సోషల్‌ మీడియాలో ఆ సంబరాలు ఫోటోలు, వీడియోలు నిండిపోయాయి.

జరుగుతున్న ప్రచారం :

దేశమంతటా సంబరాలు జరుగుతున్న క్రమంలోనే ఓ వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలను గమనిస్తే.. ఓ స్టేడియంలో బాణసంచా పేలుస్తున్న దృశ్యాలివి. ఆకాశమంతా రాత్రివేళ పగలే అయినట్లుగా ఆ సంబరాలు ఉన్నాయి. ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ భారత్‌ వశమైన సందర్భంగా ఇలా బాణసంచా పేలుస్తున్నారని రైటప్‌ ఇచ్చారు.

ధర్మహింసా తథైవచ is with జయహో భారతీయుడా. అనే ఫేస్‌బుక్‌ యూజర్‌ ఈ వీడియోను తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు. ఆ వీడియో లింక్‌ కింద చూడొచ్చు.

https://www.facebook.com/rcmjm/posts/1087218893155381/

అలాగే, Kachiraju RajeshwarRao అనే ఫేస్‌బుక్‌ యూజర్‌ కూడా ఇదే వీడియోను షేర్‌ చేశాడు. ఆ వీడియో కూడా కింది లింకుల్లో చూడొచ్చు. వీళ్లే కాకుండా చాలా మంది ఈ వీడియోను షేర్‌ చేసుకున్నారు.

 

https://www.facebook.com/kachiraju.rajeshwarrao.5/posts/pfbid02em5TgaNs6RJttbxSBgips1ZtihrYE4yFeAJMaKEiX9oicfkpJLp4t4ihgXBpWdXXl

భాస్కర న్యూస్‌ నిజ నిర్ధారణ :

అయితే, ఆ వీడియోను గమనిస్తే.. ఛాంపియన్స్‌ ట్రోఫీ జరిగిన స్టేడియం కాదని అనుమానం వచ్చింది. దీంతో, భాస్కర న్యూస్‌ ఫ్యాక్ట్‌ చెక్‌ టీమ్‌ దీని నిజ నిర్ధారణ చేయాలని సంకల్పించింది. దీంతో, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న వీడియోకు సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ను ఇన్‌విడ్‌ టూల్‌తో తీసుకుంది. ఆ కీ ఫ్రేమ్స్‌ను ఉపయోగించి రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌ చేయగా.. ఇదే వీడియోలకు సంబంధించి వేరే రైటప్‌తో మరికొన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లు కనిపించాయి.

bcarekw అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ ఈ వీడియో కువైట్‌కు చెందినదంటూ పోస్ట్‌ చేశాడు. డిసెంబర్‌ 22వ తేదీన ఈ వీడియోను షేర్‌ చేశాడు. ఆ లింక్‌ కింద చూడొచ్చు.

https://www.instagram.com/p/DD46uCtsJQC/

అలాగే, మరో ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌.. merajalam40295 కూడా ఇదే వీడియోను డిసెంబర్‌ 26వ తేదీన పోస్ట్‌ చేశాడు. దీనికి సంబంధించిన లింక్‌ కింద చూడొచ్చు.

https://www.instagram.com/merajalam40295/reel/DECobQ7O-1v/beautiful-view-kuwait-instagram-instagood-trendingreels/

వాస్తవానికి ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆదివారం అంటే.. మార్చి 9వ తేదీ 2025న జరిగింది. కానీ, పై పోస్టులు రెండూ డిసెంబర్‌ 2024లోనే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అంటే.. ఈ బాణసంచా వీడియో ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ గెలిచిన సందర్భంలోనిది కాదని అర్థమయ్యింది. అయితే, ఈ వీడియో ఏ సందర్భంలో తీశారన్న వివరాలు తెలుసుకునేందుకు భాస్కర న్యూస్‌ మరింతగా శోధించింది. ఇప్పటికే దొరికిన ఆధారాలతో కీవర్డ్స్‌ ఉపయోగించి ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేయడంతో ఈ వీడియోకు సంబంధించిన వాస్తవ కథనం దొరికింది.

Al Rai Media Group అనే వెబ్‌సైట్‌లో “Fireworks Light Up Jaber Stadium at the Opening of Gulf Zain 26” అనే శీర్షికతో ఓ కథనం కనిపించింది. ఆ కథనంలో ఇప్పుడు వైరల్‌ అవుతోన్న వీడియో ఉంది. 2024 డిసెంబర్ 21వ తేదీన Al Rai Media Group పోస్ట్‌ చేసిన ఇన్‌స్టాగ్రామ్ లోనూ ఇవే దృశ్యాలు కనిపించాయి. 26వ గల్ఫ్ కప్ ప్రారంభోత్సవ వేడుకలో బాణసంచా పేల్చిన దృశ్యాలని ఈ కథనం ద్వారా తెలిసిపోయింది. ఈ కథనానికి సంబంధించిన లింక్‌లు కింద చూడొచ్చు.

 

https://www.alraimedia.com/article/1712279/%D9%85%D8%AD%D9%84%D9%8A%D8%A7%D8%AA/%D8%A3%D8%AE%D8%A8%D8%A7%D8%B1-%D9%85%D8%AD%D9%84%D9%8A%D8%A9/%D8%A7%D9%84%D8%A3%D9%84%D8%B9%D8%A7%D8%A8-%D8%A7%D9%84%D9%86%D8%A7%D8%B1%D9%8A%D8%A9-%D8%AA%D8%B6%D9%8A%D8%A1-%D8%A7%D8%B3%D8%AA%D8%A7%D8%AF-%D8%AC%D8%A7%D8%A8%D8%B1-%D9%81%D9%8A-%D8%A7%D9%81%D8%AA%D8%AA%D8%A7%D8%AD-%D8%AE%D9%84%D9%8A%D8%AC%D9%8A-%D8%B2%D9%8A%D9%86-26

https://www.instagram.com/p/DD2VV2XIUp0/?utm_source=ig_embed&ig_rid=60615b7a-5b70-419a-8eee-2106005a31e4&img_index=9

అదే విధంగా కువైట్‌ న్యూస్‌ ఏజెన్సీ (كونا KUNA) తన ఎక్స్‌ అకౌంట్‌లో 2024 డిసెంబర్‌ 21వ తేదీన ఇదే వీడియోను, ఇదే కథనంతో పోస్ట్‌ చేసింది. ఆ లింక్‌ కూడా కింద చూడొచ్చు.

https://x.com/kuna_ar/status/1870514235970564563

ఇదే కథనానికి సంబంధించి మరికొన్ని వెబ్‌సైట్లలో వార్తా కథనాలను కింద చూడొచ్చు. ఈ కథనాల ప్రకారం.. అరేబియన్ గల్ఫ్ ఫుట్‌బాల్ కప్, “ఖలీజీ జైన్ 26”, 2024 డిసెంబర్ 21వ తేదీన కువైట్‌లోని జాబర్ అల్-అహ్మద్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎమిర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో గల్ఫ్ సంస్కృతి, ఐక్యతను ప్రతిబింబించే కళాత్మక ప్రదర్శనలు నిర్వహించారు.

https://www.saudiarabiabreakingnews.com/post/arabian-gulf-football-cup-khaleeji-zain-26-opens-with-spectacular-ceremony-in-kuwait

https://www.kuna.net.kw/ArticleDetails.aspx?id=3212035&Language=en#:~:text=Desert%20life%2C%20symbolized%20by%20the,artistic%20elements%20that%20conveyed%20a

https://sharjah24.ae/en/Articles/2024/12/21/a19

==============================================================

వైరల్‌ అవుతున్నదేంటి ?

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ భారత్‌ గెలుచుకున్న సందర్భంగా రాత్రే పగలు అయ్యిందనేలా బాణసంచా పేల్చారంటూ వీడియో

వాస్తవం ఏంటి ?

2024 డిసెంబర్‌లో జరిగిన అరేబియన్ గల్ఫ్ ఫుట్‌బాల్ కప్ ప్రారంభోత్సవ వేడుకల్లో పేల్చిన బాణసంచా వేడుకల వీడియో అది.

భాస్కర న్యూస్‌ ఫ్యాక్ట్‌చెక్‌ :

సోషల్‌ మీడియాలో జరుగుతున్నది తప్పుడు ప్రచారం. భాస్కర న్యూస్‌ ఫ్యాక్ట్‌చెక్‌ టీమ్‌ పరిశీలనలో ఈ వాస్తవం వెల్లడయ్యింది.

==============================================================

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com