ఆంధ్ర ప్రదేశ్ లో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు గానూ తెలుగు దేశం పార్టీ తమ పార్టీ నుంచి అభ్యర్థులను ప్రకటించింది. సోమవారం నామినేషన్ల దాఖలుకు చివరి గడువు కావడంతో కాసేపటి క్రితమే తెలుగు దేశం పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది.
తెలుగు దేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడును ఎంపిక చేశారు. వీళ్లు రేపు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.