33.1 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

శ్రీవారి అన్నప్రసాదంలో కొత్త ఐటమ్

తిరుమల శ్రీవారి భక్తులకు నేటి నుంచి అన్నప్రసాదంలోకి కొత్త ఐటెమ్‌ చేర్చారు. ఇకపై అన్నప్రసాదంలో భక్తులకు వడలు కూడా వడ్డిస్తారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు‌ చేతుల మీదుగా ఈరోజు భక్తులకు వడ్డించారు. ఇకపై అన్నప్రసాదం మెనూలో వడ కూడా చేరింది.

టిటిడి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించాక అన్నప్రసాదం మెనూలో అదనంగా ఒక పదార్థం పెట్టాలని ఆలోచన తనకు కలిగిందని, సీఎం దృష్టికి తీసుకెళ్లగా అంగీకరించారని చైర్మన్‌ బీఆర్‌ నాయుడు వెల్లడించారు.నాణ్యమైన దినుసులతో భక్తులకు రుచికరమైన అన్నప్రసాదాలను టిటిడి అధికారులు వడ్డిస్తున్నారన్నారు. ఉదయం 10:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రతిరోజు 35 వేల గారెలను భక్తులకు వడ్డిస్తామని వివరించారు.

భవిష్యత్తులో ఈ సంఖ్య మరింతగా పెంచి, భక్తులకు రుచికరమైన భోజనం అందిస్తామని చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు.టీటీడీ పాలకమండలి తీర్మానం మేరకు జనవరిలో వడను ప్రయోగాత్మంగా వడ్డించారు. తొలిరోజు ఐదువేల వడలను భక్తులకు వడ్డించగా.. మరో వారం పాటు పరిశీలన చేశారు. ఇప్పుడు వడను మెనూలో చేర్చి భక్తులకు వడ్డిస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com