37.4 C
Hyderabad
Tuesday, June 16, 2026

Live Video

spot_img

పోసానికి 14 రోజుల రిమాండ్

ఆదోని కేసులో మార్చి 18 వరకు రిమాండ్ విధించిన కర్నూలు కోర్టు

పోసాని కృష్ణమురళిపై రాష్ట్రవ్యాప్తంగా 17 కేసులు నమోదు

సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళికి కర్నూలు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గతంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, నారా లోకేశ్, వారి కుటుంబ సభ్యులపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కర్నూలు జిల్లా ఆదోని మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇటువంటి  కేసులోనే అరెస్టై గుంటూరు జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని తమకు అప్పగించాలంటూ ఆదోని పోలీసులు జైలు సిబ్బందిని కోరారు. వారు అనుమతినివ్వడంతో పోసానిని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల అనంతరం కర్నూలుకు తరలించారు. బుధవారం పోసానిని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఇరు పక్షాల వాదనల అనంతరం పోసానికి న్యాయమూర్తి ఈ నెల 18 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. దీంతో పాసాన్ని కర్నూలు జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు, నరసరావుపేటలో నమోదైన కేసులో పోసానికి కోర్టు ఈ నెల 13 వరకు రిమాండ్ విధించింది. పోసానిపై ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 17 కేసులు నమోదయ్యాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com