సమంత.. మూవీ ఇండస్ట్రీలో 15 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకుంది. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లైనా తన మోస్ట్ మెమోరబుల్ మూవీ ఏం మాయ చేసావె అంటోంది ఈ బ్యూటీ. ఏం మాయ చేసావే అనేది సమంత తొలి మూవీ. అంతేకాదు నాగచైతన్యతో ఈ మూవీతోనే తన ప్రయాణం మొదలైంది. అలా మొదలైన ప్రయాణం పెళ్లి, విడాకుల వరకు వెళ్లింది. అయితే ఇప్పటికీ కూడా తన లైఫ్‌లో గొప్ప సినిమా, గొప్ప క్యారెక్టర్ ఏం మాయ చేసావెనే అంటోంది.
లైఫ్‌లో ఎన్నో కష్టాలు, నష్టాలు, ఆనందాలు చూశానని.. ఇవన్ని కూడా నాలో కాన్ఫిడెన్స్‌ను పెంచాయే కానీ తగ్గించలేదంటున్నారు ఆమె. కెరీర్లో చాలా క్యారెక్టర్స్ చేశానని.. ఇప్పుడు వాటిని చూసుకుంటే నవ్వు వస్తుందంటున్నారు. కానీ ఒక్కో సినిమాతో మరింత రాటుదేలినట్టు చెబుతున్నారు. అయితే చాలా సినిమాలు వచ్చాయి.. వెళ్లాయి కానీ.. ఏం మాయ చేసావె మాత్రం చాలా స్పెషల్ అని చెబుతోంది. ఆ మూవీలోని ప్రతి షాట్ తనకు గుర్తుంది అని.. తాను చేసిన అతి గొప్ప క్యారెక్టర్లో అది కూడా ఒకటని గుర్తు చేసుకొని సంబరపడిపోయింది.