జిల్లా కలెక్టర్లను ఆదేశించిన సీయస్ శాంతికుమారి
మే 4వ తేదీన జరగనున్న నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జాతీయ స్ధాయి ప్రవేశ పరీక్షలు నిర్వహించడంలో తెలంగాణ రాష్ట్రానికి మంచి ట్రాక్ రికార్డు ఉందని, మౌలిక సదుపాయాలు, తగిన భద్రతా ఏర్పాట్లు ఉన్న ప్రభుత్వ భవనాలను గుర్తించి పరీక్ష నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు సీయస్ శాంతికుమారి సూచించారు. డా.బి.ఆర్.అంబేద్కర్ సచివాలయం నుండి నీట్ పరీక్ష ఏర్పాట్ల పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో సీయస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహింరు. కేంద్రీయ విద్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల వంటి ప్రభుత్వ భవనాలను వెంటనే గుర్తించి పరీక్ష నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా భూ క్రమబద్ధీకరణ పథకం పురోగతిని కూడా సీఎస్ సమీక్షించారు. ఇప్పటి వరకు అందిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్లను సీయస్ ఆదేశించారు. ఈ నెల 31 వరకు క్రమబద్ధీకరణ రుసుము చెల్లించిన దరఖాస్తులకు ఇచ్చే రాయితీపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. గతంలో నామమాత్రపు ఫీజులు చెల్లించిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి ఆ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు జిల్లా స్ధాయిలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పురోగతిని కూడా పర్యవేక్షించాలని సీఎస్ ఆదేశించారు.
నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చెయ్యండి
- Advertisement with us -