అతి చిన్న వయసు నుంచే గానస్వరంలో ప్రావీణ్యం కనబరుస్తోన్న సాయి వాగ్దేవి పాడుతా తీయగా గ్రాండ్ ఫినాలే పోటీల్లో విన్నర్‌గా నిలిచింది. గతంలో సరిగమప టైటిల్ గెలుచుకున్న సాయి వాగ్ధేవి.. ఇప్పుడు పాడుతా తీయగా కాంపిటీషన్స్‌లో అత్యున్నత ప్రతిభ కనబరిచింది. తన గాన మాధుర్యంతో న్యాయ నిర్ణేతలను కదిలించింది. తనకు పోటీగా నిలిచిన వాళ్లందరినీ వెనక్కి నెట్టి టైటిల్ గెలుచుకుంది. తన వయసుకు మించిన ప్రతిభను చూపిస్తూ.. అంచెలంచెలుగా పైకి ఎదుగుతోన్న సాయి వాగ్దేవి హైదరాబాద్ మణికొండలోని శ్రీ గాయత్రి ఇ-టెక్నో స్కూల్లో ఆరవ తరగతి చదువుతోంది.
పాడుతా తీయగా గ్రాండ్ ఫినాలే టైటిల్ గెలుచుకున్న సాయి వాగ్దేవికి పాఠశాల యాజమాన్యంతో పాటు.. ఉపాధ్యాయ బృందం, సిబ్బంది అభినందనలు తెలిపారు. సాయి వాగ్దేవి కృషికి, సంగీతం పట్ల ఆమెకు ఉన్న మక్కువకు ఈ గెలుపు నిదర్శనమని కొనియాడారు. ఈ సంగీత ప్రయాణంలో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సాయి వాగ్దేవి తమ పాఠశాలలో చదవడం గర్వకారణమని తెలిపారు.