30.7 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

పిలిస్తే పక్కా వస్తా.. జెలెన్ స్కీ కొత్త స్కెచ్ ఏంటి?

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కొత్త రాజకీయం మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో డైలాగ్‌ వార్‌ తర్వాత చాలా కీలక పరిణామాలు జరిగాయి. జెలెన్ స్కీ అమెరికా నుంచి నేరుగా బ్రిటన్ వెళ్లారు. అక్కడ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో కీలక మంతనాలు జరిపారు. బ్రిటన్ ఎప్పుడూ ఉక్రెయిన్‌కు మద్దతుగా ఉంటుందన్న స్టేట్‌మెంట్ వచ్చింది. దీనికి తోడు రుణ ఒప్పందంపై సంతకాలు కూడా జరిగాయి. అదే సమయంలో జెలెన్‌ స్కీకి మద్దతుగా యూరప్ దేశాలు ప్రకటనలు రిలీజ్ చేశాయి. ఇవన్నీ జరిగిన తర్వాత జెలెన్ స్కీ నుంచి ఓ ప్రకటన వచ్చింది. అమెరికాకు ఉక్రెయిన్ ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు… అమెరికాతో ఒప్పందానికి మేము సిద్ధమే అని.

ఈ మొత్తం ఎపిసోడ్‌లో జెలెన్ స్కీ మాత్రం అమెరికా ముందు ఓ పాయింట్‌ను ప్రూవ్ చేశారు. అదేంటంటే ఉక్రెయిన్ ఒంటరి కాదు అని.. తన వెనక బ్రిటన్‌తో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఉన్నాయని. నిజానికి అమెరికాతో అవసరం లేకుంటే ఈ ప్రకటన అసలు వచ్చేదే కాదు. కానీ ఈ దేశాలన్ని కేవలం మద్దతు తప్ప ఇంకేం చేయలేని పరిస్థితిలో ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆర్థికమాంద్యం గుప్పిట్లో ఉంది. ఇలాంటి సమయంలో ఈయూ దేశాలు నేరుగా యుద్ధంలోకి దిగి.. రష్యాను ఎదుర్కోనే ఆలోచన కూడా చేయవు.

అయితే ఇప్పుడు అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఎందుకంటే ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపాలన్నదే ఇప్పుడు ట్రంప్ ముఖ్య ఉద్దేశం. అదే సమయంలో ఉక్రెయిన్‌లో ఉన్న ఖనిజాలను తవ్వుకునేందుకు ఒప్పందం చేసుకోవడం అంతకన్నా ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు జెలెన్ స్కీ ఏమంటున్నారంటే.. ట్రంప్ చర్చలకు ఆహ్వానిస్తే తప్పకుండా వెళతాను అని. దీంతో బాల్ ట్రంప్ కోర్టులోకి తోశారు జెలెన్ స్కీ. మరి నెక్ట్స్ ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.

ప్రస్తుతం ట్రంప్ మెయిన్ ఫోకస్ అమెరికాకు ఏం లాభం జరుగుతుందన్నది మాత్రమే. ఇప్పటికే NATO నుంచి బయటకు వచ్చేయాలన్న డిమాండ్ పెరుగుతూనే ఉంది. మరోవైపు ప్రపంచ దేశాలకు అందించే సాయాలను నిలిపివేసింది అమెరికా. అంతేగాకుండా టారీఫ్‌లు విధిస్తామని చెబుతోంది. ఇలాంటి సమయంలో ఉక్రెయిన్‌కు బిలియన్ డాలర్ల కొద్ది సాయం చేయడం అనేది జరగని పని. అందుకే ట్రంప్ ఏం చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జెలెన్‌ స్కీని మళ్లీ ఆహ్వానించి ఒప్పందం చేసుకుంటారా? లేదా? అనేది చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com