మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు షామా మొహమ్మద్ పూనావాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకురాలు రోహిత్ లావు అయ్యాడని… చెత్త కెప్టెన్ అని అభివర్ణించింది. అతని కెప్టెన్సీని పనికిరానిదంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ చేసిన ట్వీట్ దుమారం రేపింది. దీంతో క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో షామాను ఏకి పారేశారు. కేవలం పాపులారిటీ కోసమే ఇలా దిగజారుతున్నారని కామెంట్లు వస్తున్నాయి.
రోహిత్ ఫిట్‌నెస్, కెప్టెన్సీకి మద్దతుగా ఫ్యాన్స్ షామాపై దండెత్తారు. రాజకీయ పార్టీ నేత షామా బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే మరొకరు కౌంటర్ ఇచ్చారు. రాజకీయాలకు ఏ మాత్రం సరిపోని, ఎన్నికల్లో ఓడిపోయిన చరిత్ర సృష్టిస్తున్న మీ బాస్ సంగతి చూడాలని హితవు పలికాడు. ఆటగాడిని బరువుతో కాదు ఆటతీరుతో అంచనా వేయాలని సూచించారు.
రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా 3 మ్యాచ్ లను గెలిచి సెమీఫైనల్ కు చేరుకుందని గుర్తు చేశారు. నెటిజన్లు తీవ్ర విమర్శలతో షామా మహమ్మద్ ట్విట్టర్ వేదిక నుంచి పోస్ట్ తొలగించారు. అయితే కొంతమంది రోహిత్ ఫిట్‌నెస్ పై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. భారత సంస్థలు, వ్యవస్థలను ద్వేషించే కాంగ్రెస్ నేతలు ఇప్పుడు భారత క్రికెట్ జట్టును కూడా ద్వేషించడం ప్రారంభించారని బీజెపి మండిపడింది.