అంతరిక్షంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఫైర్ ఫ్లై అనే ప్రైవేట్ సంస్థ నింగిలోకి పంపిన బ్లూ ఘోస్ట్ అనే మూన్ ల్యాండర్ సక్సెస్ ఫుల్‌గా జాబిల్లిపై ల్యాండ్ అయ్యింది. ఫైర్ ఫ్లై దీనికి సంబంధించిన లైవ్ విజువల్స్‌ను త్వరలోనే ప్రపంచానికి చూపించనుంది. మొత్తానికి చంద్రుడిపై ఎలాంటి సమస్యలు లేకుండా సక్రమంగా ల్యాండ్ చేసిన తొలి ప్రైవేట్ సంస్థగా ఫైర్ ఫ్లై నిలిచింది. ఈ ఫీట్ సాధించిన ఫైర్ ఫ్లైపై ఇప్పుడు స్పేస్ సైంటిస్టులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
బ్లూ ఘోస్ట్ చంద్రుడిపై మోన్స్ లాట్రెయిన్ ఏరియాలో ల్యాండ్ అయ్యింది మొత్తం 14 రోజుల పాటు బ్లూ ఘోస్ట్ చంద్రుడిపై పరిశోధనలు జరపనుంది. ఇప్పటికే చంద్రుడికి సంబంధించిన తొలి ఫోటోను పంపింది బ్లూ ఘోస్ట్. ల్యాండర్ సురక్షితంగా ఉందని ఫైర్ ఫ్లై టీమ్ ప్రకటించింది.
ఈ ఏడాది జనవరి 15న కెనడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది బ్లూ ఘోస్ట్. స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కాన్ 9 రాకెట్ బ్లూఘోస్ట్‌తో పాటు.. జపాన్‌కు చెందిన మరో ల్యాండర్ హకుటో ఆర్-2ని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. ఈ ల్యాండర్ కూడా మే చివరి వారంలో ఈ ల్యాండర్ కూడా జాబిల్లిపై ల్యాండ్ కానుంది.
మొత్తం చంద్రుడిపై ఉన్న ఉపరితల వాతావరణాన్ని పరీక్షించడమే ఈ మిషన్ లక్ష్యం అని చెప్పాలి. అక్కడి ధూళి.. అక్కడి మ్యాగ్నటిక్ ఫీల్డ్‌కు సంబంధించిన అంశాలపై స్టడీ చేయనుంది. భవిష్యత్తులో చంద్రుడిపైకి మ్యాన్ మిషన్‌లను పంపేందుకు కావాల్సిన పరిస్థితులను ఏర్పాటు చేసేందుకు కావాల్సిన అన్ని విషయాలను స్టడీ చేయనున్నారు. మొత్తం 10 ప్రయోగాలను చేపట్టనుంది నాసా. వీటి ద్వారా జాబిల్లిపై పూర్తి స్థాయిలో పరిస్థితులను అంచనా వేయనుంది నాసా