28.6 C
Hyderabad
Thursday, November 5, 2026

Live Video

spot_img

ఇక్కడ భగభగ.. అక్కడ గజగజ..

దక్షిణాది రాష్ట్రాల్లో ఓవైపు భానుడి భగభగలు కొనసాగుతుండగా.. మరోవైపు ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో చలికి గజగజ వణికిపోతున్నారు అక్కడి ప్రజలు. ముఖ్యంగా జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో ప్రస్తుతం మంచు వర్షం కురుస్తోంది. ఈ వర్షం ఏ స్థాయిలో కురుస్తుంది అంటే.. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే రోడ్లపై మంచు దుప్పటి కప్పుకోవడంతో రాహదారులను మూసివేశారు. ఇక కశ్మీర్‌లో అయితే మంచు వర్షం ఎఫెక్ట్‌ ఎక్కువగానే ఉందని చెప్పాలి. జమ్ము-శ్రీనగర్ హైవేను మూసేశారు. దీంతో ఉదంపూర్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఇప్పటికే రంగంలోకి దిగింది.

ఇక సిక్కింలో కురుస్తున్న భారీ హిమపాతానికి ఏకంగా నాథులా పాస్‌ మూసుకుపోయింది. వారం రోజుల క్రితమైతే మైనస్ ఐదు డిగ్రీల వరకు ఇక్కడ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లోని లెహ్, స్పితితో పాటు అనేక ప్రాంతాల్లో మంచు వర్షం కురుస్తోంది. ఇక ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుంది.

మంచు వర్షం ముప్పు అప్పుడే ముగియలేదంటున్నారు వాతావరణశాఖ అధికారులు. కశ్మీర్‌లోని గుల్మార్గ్, సోనామార్గ్, పహల్గంలో భారీగా హిమపాతం కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇక హిమాచల్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో కూడా భారీగా హిమపాతం కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేశారు. మండి, కంగ్రా, కుల్లూ, చాంబ జిల్లాల్లో భారీగా హిమపాతం కురిసే అవకాశం ఉంది.

ఉత్తరాఖండ్‌తో పాటు దేశరాజధాని ఢిల్లీ, హర్యానా, యూపీ, మద్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com