రైజింగ్ తెలంగాణలో బ్యాంకర్స్ పాత్ర కీలకమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. స్వయం ఉపాధి పథకాలకు బ్యాంకర్స్ తో కలిసి 6,000 కోట్లు. మార్చి 2న వనపర్తిలో సీఎం ప్రారంభిస్తారని వెల్లడించారు. హైదరాబాద్ లో ఈ రోజు జరిగిన బ్యాంకర్ల త్రైమాసిక సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ…గత పదేళ్లు పాలించిన వారు సంక్షేమ రంగాన్ని పక్కన పడేశారు.. మేం ప్రాధాన్యత రంగంగా భావిస్తున్నామన్నారు. దేశ ఆలోచనను ముందుకు తీసుకుపోయే విధంగా మహిళలతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి. పెట్టుబడులకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు.
రాష్ట్రంలో పెట్టుబడుదారులకు అవసరమైన నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, నాణ్యమైన నిరంతరాయ విద్యుత్తు, శాంతిభద్రతలు మంచి వాతావరణం కల్పిస్తున్నామని ఉపముఖ్యమంత్రి వివరించారు. ప్రభుత్వ కృషి ఫలితంగా దావోస్ లో 1.80 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని, సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లుగా ప్రయాణించాలన్నారు. బ్యాంకర్లు అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.