29.7 C
Hyderabad
Thursday, June 4, 2026

Live Video

spot_img

స్టార్మర్‌కు ట్రంప్‌ స్మార్ట్ క్వశ్చన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్‌ తొలిసారి భేటీ అయ్యారు. ఈ భేటీ ముఖ్య ఉద్దేశం ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. టారీఫ్‌ల అంశంపై చర్చించడం. అనుకున్నట్టుగానే ట్రంప్‌ బ్రిటన్ ప్రధానమంత్రిపై కూడా తనదైన శైలిలో పంచ్‌లు వేశారనే చెప్పాలి. ఇరు దేశాల మధ్య సహకారం ఉంటుందని.. ఇరు దేశాలు కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నామని చెబుతూనే.. జరుగుతున్న యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌కు అమెరికా సైనిక సాయం అందించాలని కోరారు బ్రిటన్‌ ప్రధాని స్టార్మర్. దానిని కొట్టిపారేశారు ట్రంప్. అలాంటిది జరిగే చాన్స్ లేదని తేల్చేశారు.

ఓవైపు ఉక్రెయిన్ -రష్యా యుద్ధం ఆపేందుకు తీవ్రంగా కృషి జరుగుతుంటే మరోవైపు అమెరికా సైనిక సాయం చేయాలని కోరడం వెనక బ్రిటన్ వ్యూహం ఏంటో వారికే తెలియాలి. ట్రంప్ ఓ వైపు కౌంటర్ ఇస్తూనే మరోవైపు సెటైర్లు వేశారు. బ్రిటన్‌ సైనికశక్తి అపారమైనదని.. దానికి వేరెవ్వరి సాయం అవసరం లేదని.. సొంత సమస్యలను వారు పరిష్కరించుకోగలరన్నారు. అయితే ఉక్రెయిన్‌కు ఫ్రాన్స్, బ్రిటన్ పీస్‌ కీపింగ్ ఫోర్స్‌ను పంపాలనే ఆలోచనలో ఉన్నాయి. ఇందులో అమెరికాను కూడా చేర్చేందుకు ప్రయత్నించారు. అందుకే ట్రంప్ ఈ కౌంటర్ వేసినట్టు కనిపిస్తోంది. బ్రిటన్‌ పంపే పీస్ కీపింగ్ ఫోర్స్‌పై దాడులు జరిగి.. వారికి సాయం అవసరమైతే అమెరికా ఎప్పటికీ బ్రిటన్‌కి అండగానే ఉంటుందని చెప్పారు ట్రంప్. అదే సమయంలో రష్యాను మీరు ఒక్కరే ఎదుర్కోగలరా అంటూ నవ్వుతూ సూటిగానే ప్రశ్నించారు ట్రంప్.

ట్రంప్ వ్యాఖ్యలను పరిశీలిస్తే అర్థమయ్యేది ఏంటంటే.. మీ గొడవ కోసం మీరు పోరాడండి.. మమ్మల్ని అవనసరంగా లాగొద్దని క్లియర్ కట్‌గా చెబుతున్నారు ట్రంప్. ఇక టారీఫ్‌ల విషయానికి వస్తే స్టార్మర్ టారీఫ్‌ల విషయంలో బాగా నెగొషియేట్ చేస్తున్నారని.. కానీ అది నాకు నచ్చడం లేదన్నారు ట్రంప్.

మొత్తంగా చూస్తే ట్రంప్‌ ఓ వైపు పొగుడుతూనే.. మరోవైపు తాను చేయాల్సింది చేస్తారని క్లియర్ కట్‌ మెసేజ్ ఇస్తున్నారు. అంతేకాదు.. త్వరలోనే రష్యా అధ్యక్షుడితో భేటీ కానున్నారు ట్రంప్. దానికంటే ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో భేటీ కానున్నారు. ఈ భేటీలోనే కీలక ఒప్పందాలతో పాటు.. యుద్ధంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై చర్చలు జరగనున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com