27.7 C
Hyderabad
Saturday, April 25, 2026

Live Video

spot_img

దర్యాప్తు సంస్థలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

దుబాయ్ లో కేదార్ మృతి రాష్ట్రంలో సంచలనంగా మారిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేదార్ జూబ్లీ హిల్స్ లో గతంలో పబ్ లను నడిపిన వ్యక్తి అని..గతంలో డ్రగ్స్ కేసులో దొరికిండని గుర్తు చేశారు. హైదరాబాద్ గాంధీభవన్ లో ఈ రోజు మీడియా సమావేశంలో పాల్గొన్న ఎన్నం శ్రీనివాస్ రెడ్డి… కేదార్ తో పాటు డ్రగ్స్ పార్టీలో ఉన్న వ్యక్తులు ఎవరో తెలియాలన్నారు.

ఎన్నం శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్…

తెలంగాణలో సంపాదించిన అక్రమ సంపాదన వేల కోట్లు దుబాయ్ తరలించారని, అక్రమ డబ్బులు ఎవరు దుబాయ్ కి తరలించారో ప్రజలకు తెలియాలన్నారు. కేంద్ర,రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి. గత ప్రభుత్వంలో ఉన్న బినామిలు ఇప్పుడు ఎక్కడికి పోయారో తెలియాలి.

వేలకోట్లు విదేశాలకు తరలిపోతుంటే రాష్ట్రంలో విచారణ సంస్థలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వం ఏర్పడి 14నెలలు అవుతున్నా విచారణ సంస్థలు ఇప్పటి వరకు ఒక్క హవాలా వ్యక్తిని కూడా పట్టుకోలేదు. డ్రగ్స్ దందాలో సినీ ప్రముఖుల ప్రమేయం ఉందని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికైన హవాలా దందా పై యాక్షన్ తీసుకోకపోతే భవిషత్తులో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. సినీ ప్రముఖులకు విజ్ఞప్తి. సినీ ప్రముఖులు బ్రాండ్ అంబాసిడర్ పేరుతో సంపాదించిన సొమ్ము విదేశాలలో పెట్టుబడులు పెడుతున్నారు. చీటర్స్ చేతిలో సూపర్ స్టార్స్ మోసపోతున్నారు. సంపాదించిన సొమ్ముతో కొంత తెలంగాణకు కేటాయించాలని కోరుతున్నాను.

తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. మీ సంపాదనలో కొంత తెలంగాణ విద్యానిధికి కేటాయించండి. తెలంగాణ పిల్లల భవిషత్తు అందంగా తీర్చి దిద్దాడానికి సహకరించండి. ఇప్పటికైన యాక్షన్ తీసుకోకపోతే భవిషత్తులో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com