ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో మార్చి నెలలో జరిగే ప్రత్యేక ఉత్సవాల వివరాలను టీటీడీ పాలకమండలి విడుదల చేసింది. ప్రతియేటా జరిగే మాదిరిగానే.. ఆయా తిథులు, ప్రత్యేక రోజుల్లో విశేష పూజలు, సంప్రదాయ రీతిలో స్వామి వారి సేవలు నిర్వహించనున్నారు. మార్చి నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే విశేష ఉత్సవాల వివరాలు కింద చూద్దాం…
7వ తేదీ – తిరుక్కచ్చినంబి శాత్తుమొర
9వ తేదీ – కులశేఖరాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం.
10వ తేదీ – మతత్రయ ఏకాదశి
13వ తేదీ – తిరుమల శ్రీవారి తెప్పోత్సవాల సమాప్తి
14వ తేదీ – కుమారధారతీర్థ ముక్కోటి
25వ తేదీ – సర్వ ఏకాదశి
26వ తేదీ- అన్నమాచార్య వర్థంతి
28వ తేదీ – మాస శివరాత్రి
29వ తేదీ – సర్వ అమావాస్య
30వ తేదీ – శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది, శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం
శాస్త్రోక్తంగా, సంప్రదాయ బద్ధంగా పై ఉత్సవాలు మార్చి నెలలో తిరుమలలో జరుగుతాయని టీటీడీ వివరించింది.