35.2 C
Hyderabad
Thursday, April 23, 2026

Live Video

spot_img

మహారాణి హుమా ఖురేషీ

హుమా ఖురేషి 2012లో గ్యాంగ్స్ అఫ్ వస్సేపూర్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి హిందీతో పాటు తమిళం, మరాఠీ సినిమాల్లో నటించింది. బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హుమా..సహా నటులతో సరదాగా ఉంటుందని అందరు అభిమానిస్తారు. లేటెస్ట్ ఫోటోలతో హుమా ఖురేషీ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.  హుమా ఖురేషీ 1986లో ఢిల్లీలో పుట్టింది. కశ్మీర్ కు చెందిన వీరి కుటుంబం ఢిల్లీకి వలస వచ్చారు. హుమా తండ్రికి ఢిల్లీలో రెస్టారెంట్లు ఉన్నాయి.ఢిల్లీలో హిస్టరీలో డిగ్రీ చేసిన హుమా ఖురేషీ… ఆ తర్వాత మోడలింగ్ వైపు వెళ్లి ముంబైకి షిఫ్ట్ అయింది. అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ లతో కలిసి యాడ్స్ చేసింది.గ్యాంగ్స్ అఫ్ వస్సేపూర్ సీక్వెల్ తో ఇక వెనుతిరిగి చూడకుండా వరుసగా అగ్రహీరోలందరితో హుమా సినిమాలు చేసింది.ఉపనిషద్ గంగ, మిథ్యా తదితర వెబ్ సీరీసుల్లో నటించిన హుమా ఖురేషీ మహారాణీ వెబ్ సీరీస్ తో ఉత్తరాదిన పాపులారిటీ సాధించింది.అధిక బరువు అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యల ఆధారంగా నిర్మించిన డబుల్ ఎక్సెల్‌ చిత్రంలో  చిత్రంలో హ్యూమా ఖురేషి, సోనాక్షి సిన్హాతో కలిసి చేసింది.డబుల్ ఎక్సెల్ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించిన టీమ్ ఇండియా కెప్టెన్ శిఖర్ ధావన్ ఎఫైర్ ఉందని పుకార్లు వచ్చాయి. శిఖర్ ధావన్ కు ఆయన భార్య అయేషా ఖాన్ తో విడాకులు కావడంతో పుకార్లు బలపడ్డాయి. అయితే వీరిద్దరి మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని తేలిపోయింది.హుమా ఖురేషీ ముగ్గురు సోదరుల్లో సాకిబ్ సలీం కూడా సినిమాలు, వెబ్ సీరీసుల్లో నటిస్తున్నాడు.స్నేహితులతో సినిమా ఫంక్షన్లలో సూటిగా సుత్తి లేకుండా మాట్లాడటం హుమా ఖురేష్ నైజం. ప్రస్తుతం జాలీ LLB 3, గులాబీ, పూజ మేరీ జాన్ తదితర సినిమాలతో అందాల హుమా బిజీగా ఉంది.

courtesy : instagram

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com