28.6 C
Hyderabad
Thursday, November 5, 2026

Live Video

spot_img

గిల్ సూపర్ సెంచరీ.. బంగ్లాపై టీమిండియా విక్టరీ

ఛాంపియన్స్ ట్రోఫీని విక్టరీతో ప్రారంభించింది టీమ్ ఇండియా. బంగ్లాపై ఏకంగా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది రోహిత్ సేన. రోహిత్ ధనాధన్ బ్యాటింగ్.. శుభ్‌మన్‌ గిల్ సూపర్ సెంచరీ, ఆఖర్లో రాహుల్ మెరుపులతో టీమిండియా విక్టరీ సాధించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బంగ్లాదేశ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. 35 ఓవర్లకే ఐదు వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్‌. దీంతో 100 పరుగులకే ఆలౌట్ అవుతుందనుకున్నారు. కానీ అందరి అంచనాలను వమ్ము చేశారు జకేర్ అలీ, హృదోయ్ జోడి. నిజానికి జకేర్‌ అలీ క్రీజులోకి రాగానే ఇచ్చిన క్యాచ్‌ను రోహిత్‌ మిస్‌ చేశాడు. క్యాచ్‌తో పాటు అతని హ్యాట్రిక్‌ కూడా మిస్‌ అయిపోయింది. ఇక అక్కడి నుంచి నిలకడగా ఆడుతూ బంగ్లాదేశ్‌ మంచి స్కోర్ చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. జకేర్ 68 పరుగులు చేయగా.. హృదోయ్ ఏకంగా సెంచరీ కొట్టాడు. అయితే మొదటి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లతో చెలరేగిపోయాడు మహ్మద్ షమీ. మరోవైపు హర్షిత్ మూడు, అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీశారు. దీంతో 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట్ అయ్యింది బంగ్లాదేశ్.

ఇక 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఓపెనర్లు.. ధాటిగా ఆడారు. రోహిత్‌ అయితే స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. టీమ్ ఇండియా స్కోర్‌ 8 ఓవర్లలోనే 60 పరుగులు దాటింది. భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి రోహిత్ 41 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ ఆచితూచి ఆడాడు. కానీ 22 పరుగులు చేసి రిషద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ కూడా 15 పరుగులకే ఔటయ్యాడు. అక్షర్‌ పటేల్ ఈ సారి భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి ఔటయ్యాడు. ఇక కేఎల్ రాహుల్ గిల్‌తో కలిసి ఆటను కొనసాగించాడు. వీరిద్దరు 87 పరుగుల పాట్నర్‌షిప్‌ చేశాడు. ఇదే సమయంలో గిల్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు రాహుల్.

ఈ మ్యాచ్‌లో రెండు రికార్డులు నమోదయ్యాయి. రోహిత్ 11 వేల పరుగులను పూర్తి చేసుకోగా.. షమీ అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన భారత ప్లేయర్‌గా నిలిచాడు. 104 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్‌ను సాధించాడు షమీ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com