28.8 C
Hyderabad
Thursday, June 25, 2026

Live Video

spot_img

ఫస్ట్ మ్యాచ్ ఛాంపియన్.. కివీస్

ఛాంపియన్స్ ట్రోఫీ అట్టహాసంగా ప్రారంభమైంది. న్యూజిలాండ్, పాకిస్థాన్‌ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో కివీస్ అదరగొట్టింది. పాక్ బ్యాటర్లు కాస్త కష్టపడినా ఓమటి మాత్రం తప్పలేదు. ఏకంగా 60 పరుగుల తేడాతో కివీస్ గెలిచింది. దీంతో ఆతిథ్య జట్టుకు పరాభవం తప్పలేదనే చెప్పాలి.

మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్ మొదట్లో కాస్త తడపబ్డ.. 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. విల్‌యంగ్, టామ్ లాథమ్‌ సెంచరీలతో పరుగుల వరద పారించారు. ఇక గ్లెన్ ఫిలిప్స్‌ కేవలం 39 బంతుల్ఓల 61 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. దీంతో 320 పరుగులు చేసింది కివీస్. ఇక ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన పాక్ ఆటగాళ్లు తడబడ్డారనే చెప్పాలి. దీంతో 47.2 ఓవర్లలో 260 పరుగులకే ఆలౌట్ అయ్యింది పాకిస్థాన్.

పాకిస్థాన్ తొలి 10 ఓవర్లకు చేసిన స్కోర్ 22 పరుగులు మాత్రమే. అప్పటికే రెండు కీలక వికెట్లను కోల్పోయింది. షకీల్, రిజ్వాన్‌ సింగిల్ డిజిట్‌కే వెనుదిరిగారు. బాబర్ అజామ్‌ హాఫ్ సెంచరీ చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే సల్మాన్‌ ఆఘా ఎంట్రీతో మళ్లీ స్కోర్ పరుగులు పెట్టింది. కేవలం 28 బంతుల్లో 42 పరుగులు చేశాడు సల్మాన్. దీంతో స్కోర్ పరుగులు పెట్టినట్టే అనిపించింది. కానీ స్మిత్‌ అతడిని ఔట్ చేయడంతో సీన్ మారిపోయింది. ఇక కుష్‌దిల్ షా పోరాటం మాత్రం హైలేట్ అని చెప్పాలి. అంత ఒత్తిడిలో కూడా ధనాధన్‌ షాట్స్ ఆడాడు. 69 పరుగులు చేశాడు. కానీ అతడికి మరెవ్వరి నుంచి సహకారం అందలేదనే చెప్పాలి. ఇంతలోనే ఓరూర్క్‌ అతడిని ఔట్ చేయడంతో పాక్‌ ఓటమి ఇక లాంఛనమైందనే చెప్పాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com