బహిరంగ మార్కెట్ లో మిర్చికి డిమాండు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించినట్లైతే రైతులు నష్టపోతారనే ఉద్దేశంతో మిర్చికి ఇప్పటి వరకూ కనీస మద్దతు ధర ప్రకటించలేదని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శ్రీలంక, చైనా, మలేషియా తదితర దేశాలకు మన మిర్చి ఎగుమతి అయ్యేదని, అయితే ఆయా దేశాలు సొంతంగా మిర్చి పంట సాగు చేసుకోవడం వల్ల మిర్చి ఎగుమతులు చాలా తగ్గిపోవడం వల్ల మిర్చి రేటు తగ్గిందన్నారు. రాష్ట్రంలోని మిర్చి రైతులకు సాధ్యమైనంత మేర సహకరించాలని, ప్రస్తుతం ఉన్న కేంద్రం మద్దతు ధరను కూడా పెద్ద ఎత్తున పెంచాలని కోరేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు డిల్లీ వెళుతున్నారన్నారు. అయితే ఈ విషయాలను అన్నింటినీ వక్రీకరిస్తూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు రాజకీయం చేస్తూ తమ ప్రభుత్వంపై బురద జల్లే విధంగా ప్రయత్నించడం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు.
- Advertisement with us -