మల్కాజ్గిరి జిల్లా ఆసుపత్రిలో ఆశా వర్కర్ల పట్ల వైద్యులు, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై కార్పొరేటర్ శ్రవణ్ ఆరా తీశారు. తమను ఆసుపత్రిలోకి రావొద్దంటూ వైద్యులు, సిబ్బంది విసుక్కుంటున్నారని ఆశా వర్కర్లు కార్పొరేటర్‌కు తమ మొర వెల్లడించుకున్నారు. పెద్దగా అవగాహన లేని పేషెంట్లను తీసుకొని కాన్పుకోసమో, వాక్సిన్ కోసమో వస్తే.. తాము తీసుకొచ్చిన పేషెంట్లను చూడటం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో, జిల్లా ఆసుపత్రికి వెళ్లిన కార్పొరేటర్ శ్రవణ్ వైద్యులతో మాట్లాడారు.
ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీత అందుబాటులో లేకపోవడంతో ఆర్ఎంఓ శివకిరణ్, డాక్టర్ సంగీత్‌లతో కార్పొరేటర్ భేటీ అయ్యారు. ఆశ వర్కర్లకు స్థిర వేతనం ఉండదని, తెచ్చిన రోగులను బట్టి వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుందని, కాబట్టి.. ఆశా వర్కర్లకు వైద్యులు, సిబ్బంది సహకరించాలని కార్పొరేటర్ శ్రవణ్ ఆర్ఎంఓను కోరారు. వాస్తవానికి జిల్లా ఆసుపత్రి పిహెచ్సిదని, ఆశ వర్కర్లను అక్కడికి రానీయక పోవడం వల్ల రోగులు కూడా నష్టపోతారని చెప్పారు. ఆశ వర్కర్లకు అనారోగ్యం ఏర్పడితే ప్రాధాన్యతతో వారికి వైద్యం అందించాలని కోరారు. అలాగేచ నేరేడ్మెట్లోని పీహెచ్‌సీని మల్కాజిగిరి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఇక్కడకు మార్చాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఆశ వర్కర్లు హేమలత, వసంత, శిరీష, లక్ష్మి, రవి తదితరులు పాల్గొన్నారు.