- వైఎస్ జగన్ విజయవాడ పర్యటనలో గూస్ బంప్స్
ఎక్కడా స్క్రీన్ ప్లే లేదు.. ఎవరూ చెప్పలేదు.. ఏ ఒక్కరూ ప్రోత్సహించలేదు. కానీ, కల్మషం లేని ఆత్మీయతకు ఆ సన్నివేశం నిదర్శనంగా కనిపించింది. ఆ భావోద్వేగం లక్షలు, కోట్లు కుమ్మరించినా దొరకదు. అంతా లైవ్ సీన్. టీవీల్లో, సోషల్ మీడియాలో లైవ్‌లో కనిపిస్తోంది. నిండైన, నిఖార్సైన అభిమానం, ఆత్మీయత పొంగిపొర్లింది. విజయవాడలో ఈ అత్యంత అరుదైన సన్నివేశం కనిపించింది. టీవీల్లో చూసిన వాళ్లకు, సోషల్ మీడియాలో గమనించిన వాళ్లకు గుండె తరుక్కుపోయింది. ఆ దృశ్యం చూసిన వాళ్ల అందరి మనసులనూ కలచివేసింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి విజయవాడ వెళ్లిన సమయంలో జరిగిందీ సంఘటన.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీతో ములాఖత్ అయ్యారు. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి తిరిగి వెళ్లిపోతున్న సమయంలో జనాభిమానం ఎగిసిపడింది. అందరిలాగే ఓ చిన్నారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చూసేందుకు తండ్రితో పాటు వచ్చింది. అయితే, జగన్‌ను చూడటంతోనే ఆమె మనసు అంగీకరించలేదు. ఇంకేదో కావాలి. జగనన్నను హత్తుకోవాలి.. ఆయనకు ఓ ముద్దివ్వాలి. ఆత్మీయంగా అన్నా.. అని కళ్లల్లో కళ్లు పెట్టి చూడాలి.. అనుకుంది. జగన్‌ను చూస్తూనే.. భావోద్వేగంలో మునిగిపోయింది. జగనన్నను కలుస్తానని, ఆయనకు షేక్ హ్యాండ్ ఇస్తానని మారాం చేసింది. కానీ, చుట్టూ సెక్యూరిటీ.. ఆ పై మొత్తం జనసంద్రం. జగనన్నను ఎలా కలిసేది? కానీ, ఆ చిన్నారికి మాత్రం అవేమీ అడ్డంకులనిపించలేదు. జగనన్న కాన్వాయ్ దగ్గరికి రాగానే ఆయన దగ్గరికి వెళ్తానంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె మారాం చేయడం, జగనన్న కోసం పరితపించడం చూసి సెక్యూరిటీ కూడా కాస్త కదిలి పోయారు. దీంతో… ఆ చిన్నారి జగనన్న దృష్టిలో పడింది. తన దగ్గరికి వచ్చేందుకు అంతలా మారాం చేస్తుండటం చూసి చేయి చాచాడు వైఎస్ జగన్.. ఆ అమ్మాయిని దగ్గరికి రమ్మని పిలిచాడు. అంతే.. ఆ చిన్నారి క్షణాల్లోనే జగనన్న వాహనంపైకి చేరుకుంది. ఆమెను ఆప్యాయంగా నుదుటిపై ముద్దాడాడు జగనన్న. ఆ సంతోషంలో పాపాయి ఉక్కిరిబిక్కిరయ్యింది. జగనన్నను హత్తుకుంది. మనసారా తన్మయత్వంలో మునిగిపోయింది. జగనన్నే నాకు ముద్దు పెడతాడా? నేను పెట్టనా? అనుకుంది. తానూ జగనన్నకు ముద్దిచ్చింది. అంతేనా.. సెల్‌ఫోన్‌లో జగనన్నతో సెల్ఫీ తీసుకుంది. సమయం గడిచిపోతున్నకొద్దీ ఆ చిన్నారి కళ్లల్లో జగనన్న నుంచి దూరంగా వెళ్తున్నాననే ఆందోళన స్పష్టంగా కనిపించింది. ఇంకాసేపు అన్న ఒళ్లోనే ఉండాలనిపించింది. కానీ, తప్పదుగా.. అందుకే ఇక, చివరగా జగనన్నకు ఫ్లైయింగ్ కిస్ ఇస్టూ.. తిరిగి నాన్న ఒళ్లోకి చేరుకుంది.
ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ అమ్మాయి తన జీవితానికి ఇది చాలు అనుకుంటోంది. జగనన్న తనను ఎత్తుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యానని ఆ చిన్నారి తెలిపింది. జగనన్నను కలవడం నాకు ఇదే ఫస్ట్ టైమ్ అని, తనను ఎత్తుకుని జగనన్న ముద్దుపెట్టారని, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానని, తనకైదే ఇది చాలని చెప్పింది. జగనన్న సీఎంగా ఉన్నప్పుడు తమకు ఏ ఇబ్బందీ ఉండేది కాదన్న చిన్నారి.. ఇప్పుడు ఇంట్లో ఇబ్బంది అవుతోందని చెప్పింది. తమకు ఇప్పుడు అమ్మ ఒడి రావడం లేదని, ఏదీ రావడం లేదని, చాలా ఇబ్బందిగా ఉందని, తమ ఫీజులు కట్టడానికి కూడా ఇంట్లో ఇబ్బందిగా ఉందని చెప్పింది. జగనన్న ఉన్నప్పుడు రూ. 15 వేలు వచ్చేవని, అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదని, కానీ, ఇప్పుడు మాత్రం అంతా ఇబ్బందిగానే ఉందని ఆ చిన్నారి మీడియాకు తెలిపింది.