27.7 C
Hyderabad
Thursday, April 23, 2026

Live Video

spot_img

హైకోర్టులో కేసు వాదిస్తూనే కుప్పకూలిన సీనియర్‌ న్యాయవాది

హైకోర్టులో ఓ కేసును వాదిస్తూనే సీనియర్‌ న్యాయవాది ఒకరు కుప్ప కూలి పోయారు. అది గమనించిన అక్కడున్న వాళ్లందరూ వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఆసుపత్రికి తీసుకెళ్ల లోగానే ఆయన మృతి చెందారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో జరిగిందీ విషాద సంఘటన.

సీనియర్‌ న్యాయవాది వేణు గోపాల్‌ రావు రోజూ మాదిరిగానే మంగళవారం ఉదయం హైకోర్టుకు చేరుకున్నారు. తన క్లెయింట్‌కు సంబంధించిన ఓ కేసు విచారణలో పాల్గొన్నారు. కేసు విచారణలో భాగంగా వాదోప వాదాలు జరుగు తున్నాయి. అయితే, తన క్లెయింట్‌కు చెందిన కేసులో వాదనలు వినిపిస్తూనే అడ్వొకేట్‌ వేణు గోపాల్‌ రావ్‌ కోర్టు హాల్‌ లోనే కుప్ప కూలి పోయారు.

న్యాయవాది వేణు గోపాల్ రావు కుప్ప కూలి పోవడంతో జడ్జి సూచన మేరకు అక్కడున్న తోటి న్యాయ వాదులందరూ ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి వెళ్లే మార్గ మధ్యలోనే వేణు గోపాల్‌ రావు మృతి చెందారు. దీంతో, హైకోర్టులో విషాదం అలుముకుంది.

ఆసుపత్రికి తీసుకెళ్లిన వేణు గోపాల్ రావు మరణించారన్న విషాద వార్త కాసేటిలోనే అందరికీ తెలిసింది. దీంతో, ఆయన మరణానికి సంతాప సూచకంగా తెలంగాణ హై కోర్టులోని అన్ని బెంచ్‌ లలో న్యాయమూర్తులు విచారణను నిలిపి వేశారు. ఇవాళ జరగనున్న అన్ని కేసుల విచారణలు రేపటి వాయిదా వేస్తూ జడ్జిలందరూ ఆదేశాలు జారీ చేశారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com