అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన మిర్జాపూర్ వెబ్ సీరీస్ లో ముఖ్యమంత్రిగా ఇషా తల్వార్ నటించింది. మిర్జాపూర్ లో తన అభినయంతో అదరగొట్టింది. హింది, తెలుగు, తమిళం, మళయాలం, పంజాబీ తదితర భాషాల్లో నటించిన ఇషా సోషల్ మీడియాలో కత్తి లాంటి ఫోటోలను షేర్ చేస్తుంది. పేరుకు తగిన అందం ఇషా తల్వార్ సొంతంముంబైలో 1985లో జన్మించిన ఇషా తల్వార్ పిజ్జా హట్ వివిధ చర్మ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా చేసింది.
2012లో థట్టథిన్ మరయతు మళయాలి సినిమాతో సినీ ప్రపంచంలోకి వచ్చిన ఇషా.. అదే ఏడాది లవ్ మి అనే మరో సినిమా మళయాలంలో చేసింది.
2013లో తెలుగు ప్రేక్షకులకు గుండె జారి గల్లంతయ్యిందే సినిమాతో ఇషా పరిచయం అయింది. ఈ సినిమాలో నితిన్ సరసన నటించింది.
2014లో మైనే ప్యార్ కియా, రాజా చెయ్యి వేస్తే సినిమాల ద్వారా తెలుగులో అభిమానులను ఆకట్టుకుంది.
36 ఏళ్ల వయసులో కూడా కైపెక్కించే అందాలతో కవ్విస్తున్న ఇషా తల్వార్..బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది.
2016 తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు. మిర్జాపూర్ వెబ్ సీరీస్లో ఇషా ముఖ్యమంత్రి పాత్రలో ఒదిగిపోయింది.
ఆకట్టుకునే అందంతో ఈ అమ్మడి ఫోటోలు రెగ్యులర్ గా వైరల్ అవుతూ ఉంటాయి. ఈసారి కూడా అంతకు మించిన అందంతో ముద్దుగుమ్మ ఇషా తల్వార్ కవ్విస్తోంది.
36 ఏళ్లు వచ్చినా ఈ అమ్మడు ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఎవరివరితోనో జత కట్టిందని వార్తలు వస్తున్నా అవి గాసిప్స్ అని తేలిపోయింది.
courtesy: instagram